Rajamouli First Love : ఫస్ట్ లవ్ గురించి చెప్పేసిన ఎస్.ఎస్.రాజమౌళి.. ఇంట్రెస్టింగ్ ఫ్లాష్‌బ్యాక్
నాపై ప్రభావం చూపిన వాళ్లలో వర్ఘీస్ కురియన్, లాల్ బహదూర్‌శాస్త్రి(Rajamouli First Love) ఉన్నారు’’ అని రాజమౌళి చెప్పుకొచ్చారు.
- By Pasha Published Date - 04:31 PM, Sat - 14 December 24

Rajamouli First Love : తన ఫస్ట్ లవ్ గురించి అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆసక్తికర వివరాలను వెల్లడించారు. రానా దగ్గుబాటి కామెంటేటర్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ఒక టాక్ షోలో ఈవివరాలను ఆయన తెలిపారు. ఆ విశేషాలను ఇప్పుడు మనం కూడా తెలుసుకుందాం..
Also Read :Agriculture Loans : రైతులకు గుడ్ న్యూస్.. తాకట్టు లేకుండా రూ.2 లక్షల లోన్
‘‘ఈగ సినిమాలో నాని, సమంత మధ్య చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలే .. నాకు, నా ఫస్ట్ లవర్ భారతికి మధ్య నిజంగా జరిగాయి’’ అని రాజమౌళి తెలిపారు. ఒక దర్శకుడిగా తాను జీవితంలో చూసిన పలు సంఘటనలు, సొంత అనుభవాలను కూడా సినిమాల్లో పొందుపర్చినట్లు ఆయన ఒప్పుకున్నారు. ‘‘నేను ఇంటర్ చదివేటప్పుడు మా క్లాస్‌లో భారతీ అనే అమ్మాయి ఉండేది. ఆమె నా ముందు బెంచ్‌లో కూర్చునేది. ఆమె అంటే నాకిష్టం. కానీ మాట్లాడేందుకు భయపడ్డాను. ఒకసారి ధైర్యం చేసి భారతిని పలకరించాను. ‘భారతీ.. ట్యూషన్ ఫీజు కట్టావా’ అని అడిగాను. అలా అడిగే సరికి.. ఆమె ముఖంలో తీవ్ర నిరాశ కనిపించింది. పిలిచింది ఇది అడగటానికా అనేలా నా వైపు చూసిన భారతి.. తల ఊపేసి వెంటనే అటువైపు తిరిగిపోయింది’’ అని రాజమౌళి కాలేజీ రోజులను గుర్తుచేసుకున్నారు.
Also Read :Presidents Impeachment : అధ్యక్షుడు ఔట్.. అభిశంసన తీర్మానం పాస్.. అధికార, విపక్షాలు ఏకం
‘‘నాకు సీనియర్ ఎన్టీఆర్ అంటే చాలా అభిమానం. ఆయన సినిమాలు బాగా చూసేవాడిని. నాకు ‘మిస్సమ్మ’ మూవీ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు కొవ్వూరు లైబ్రరీలో అమర చిత్ర కథలు బాగా చదివేవాడిని. అందుకే నా మూవీల్లో ఎక్కువగా ప్రతీకారాన్ని చూపిస్తా. నాపై ప్రభావం చూపిన వాళ్లలో వర్ఘీస్ కురియన్, లాల్ బహదూర్‌శాస్త్రి(Rajamouli First Love) ఉన్నారు’’ అని రాజమౌళి చెప్పుకొచ్చారు. ‘‘సినిమా కథలపై చర్చల సమయంలో నేను, మా నాన్న కూర్చొన్నప్పుడు తండ్రీ కొడుకులమన్న విషయం మాకు అస్సలు గుర్తుండదు. ఒక రచయిత, దర్శకుడు అన్నట్లుగానే మా మధ్య చర్చ జరుగుతుంది’’ అని ఆయన తెలిపారు.