Mercedes Benz 2022: మెర్సిడెస్ కొత్త లగ్జరీ కారు…మే 10న లాంచ్…ఫీచర్లు ఇవే..!!
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ ఆటోమోటివ్ బ్రాండ్ మెర్సిడెస్ -బెంజ్ కొత్త లగ్జరీ సెడాన్ 2022 సిక్ాలస్ ను అధికారికంగా ఆవిష్కరిచింది.
- By Hashtag U Published Date - 02:29 PM, Fri - 6 May 22

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ ఆటోమోటివ్ బ్రాండ్ మెర్సిడెస్ -బెంజ్ కొత్త లగ్జరీ సెడాన్ 2022 సిక్ాలస్ ను అధికారికంగా ఆవిష్కరిచింది. ఈ లగ్జరీ కారును మే 10న భారత మార్కెట్లో రిలీజ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు ప్రారంభించింది. బేబీ సి క్లాస్ అని పిలిచే…కొత్త సి క్లాస్ పూణే సమీపంలోని చకాన్ ప్లాంట్ లో తయారు చేయనుంది. మెర్సిడెస్ ఇప్పటికే కొత్త సి క్లాస్ బుకింగులను కూడా స్టార్ట్ చేసింది. లాంచ్ తర్వాత మెర్సిడెస్ బెంజ్ సి క్లాస్ మూడు వేరియంట్లలో అందుబాటులోకి వస్తుంది. సి200, సి220డి , టాప్ ఎండ్ సి 300డి. ఈ మోడల్స్ ఆన్ లైన్లో అలాగే మెర్సిడెస్ రిటైల్ ఆఫ్ ది ఫ్యూజర్ ప్రోగ్రామ్ కింద అందుబాటులోకి ఉండనుంది.
ఫీచర్లు…
సి-క్లాస్ , ఇ క్లాస్ అండ్ టాప్ ఆఫ్ ది లైన్ ఎస్ క్లాస్ కి దగ్గరగా తీసుకొచ్చేందుకు మెరుగుపరచబడిని లగ్జరీ ఫీచర్లను పొందుతుంది. మెర్సిడెస్ కొత్తగా అప్ డెటెడ్ సెడాన్ ఇంతకుముందూ ఎన్నడూ లేనంత ఎక్కువమంది కొనుగోలుదారులను ఆకర్షిస్తుందని కంపెనీ భావిస్తోంది. విడుదల తర్వాత కొత్త సి క్లాస్ వోల్వో ఎస్ 60 , బిఎండబ్ల్యూ 3 సిరీస్, ఆడి ఏ4 లాంటి కార్లతో పోటీపడుతుంది.
స్పెసిఫికేషన్స్:
ఐదవ జనరేషన్ మెర్సిడెస్ బెంజ్ సి క్లాస్ మూడు వేరియంట్లో రిలీజ్ చేయనుంది. ఇందులో టాప్ ఆఫ్ ది లైన్ సి300డి కి అదనంగా సి200, సి220డి ఉన్నాయి. లగ్జరీ సెడాన్ కొత్త 1.5లీటర్ పెట్రోల్ అండ్ 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ లతో రానుంది. రెండు ఇంజన్లు మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ స్టాండర్డ్ గా పొందనున్నాయి.
బుకింగ్ వివరాలు:
2022 మెర్సిడెస్ బెంజ్ సి క్లాస్ కోసం కంపెనీ ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభించింది. మే 1 నుంచి కొనుగోలుదాలుందరికీ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. మెర్సిడెస్ బెంజ్ సి క్లాస్ బుకింగ్ మొత్తాన్ని రూ. 50,000గా ఉంచారు.
కలర్ ఆప్షన్:
మెర్సిడెస్ సి 300డిని మూడు ఎక్స్టీరియర్ పెయింట్ స్కీములతో అందిస్తుంది. ఇందులో మానుఫ్యాక్చర్ ఒపలైట్ వైట్, కావాన్ సైట్ బ్లూ, అబ్సిడియన్ బ్లాక్ ఉన్నాయి. సి క్లాస్ కింద రెండు వేరియంట్స్ సెలెస్టైన్ గ్రే, మోజావే సిల్వర్, హై టెక్ సిల్వర్ లో మరో మూడు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి.
ఇంటీరియర్ :
కొత్త సిక్లాస్ ఇంటీరియర్ లో కూడా చాలా అప్ డేట్స్ వచ్చాయి. క్యాబిన్ మూడు రంగుల థీమ్ ఆప్షన్స్ తో వస్తుంది. ఇందులో మకియాటో బీజ్, సియెన్నా బ్రౌన్, బ్లాక్ తో వుడ్ ట్రిమ్ లేదా మెటల్ ట్రిమ్ ఉన్నాయి. డ్యాష్ బోర్డు మధ్యలో సరికొత్త MBUX సిస్టమ్, 2.3-అంగుళాల ఫుల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో కూడిన 11.9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఎస్ -క్లాస్ లాగానే ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌లో ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో పాటుగా యూజర్ల ప్రొఫైల్‌లను సేవ్ చేయడానికి బయోమెట్రిక్ స్కానర్ కూడా ఉంటుంది. ఇంకా రీడిజైన్ ఎయిర్ వెంట్స్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెనుక ప్రయాణీకుల కోసం ఆర్మ్‌రెస్ట్‌లు, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో ఈ కారు వస్తుంది.