Modi Visakha
-
#Andhra Pradesh
Vizag is a Key Center For Trade: వాణిజ్యానికి విశాఖ కీలక కేంద్రం – ప్రధాని నరేంద్ర మోడీ
విశాఖపట్నం వాణిజ్యానికి కీలక కేంద్రమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. విశాఖపట్నంలో రూ. 10,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. మరో రూ. 7,619 కోట్ల విలువైన నాలుగు పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన తరువాత బహిరంగ సభలో దేశం దూసుకెళుతోందని చెప్పుకొచ్చారు. ప్రపంచ దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతోన్న ప్రస్తుత సమయంలో భారత్ ప్రగతి దిశగా వెళుతోందని అన్నారు. `బ్లూ` ఎకానమీ అభివృద్ధికి భారత్ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మోదీ వెల్లడించారు. వైజాగ్ ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ మత్స్యకారుల ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుందని అన్నారు. ఆయన ప్రసంగంలోని ప్రధాన అంశాలివి.
Date : 12-11-2022 - 12:23 IST -
#Andhra Pradesh
Jagan Agenda Before Modi: మోడీ ఎదుటే `జగన్ ఎజెండా` కుండబద్దలు
వైసీపీ ఎజెండా ఏమిటో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎదుట సీఎం జగన్మోహన్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. రాష్ట్ర ప్రయోజనాలే మా ఎజెండా అంటూ పరోక్షంగా బీజేపీకి జలక్ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా మోడీతో అనుబంధం ఉందని చెబుతూనే ఏపీ ప్రయోజనాలను కాపాడే ఏ ఇతర పార్టీలతోనైన జత కట్టడానికి వెనుకాడబోనని జగన్మోహన్ రెడ్డి సున్నితంగా పరోక్ష సంకేతాలు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది.
Date : 12-11-2022 - 11:48 IST