Justice PC Ghosh Commission
-
#Speed News
TG High Court : కేసీఆర్, హరీశ్ రావులకు ఊరట..కాళేశ్వరం నివేదిక ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్టు
వీరిద్దరూ హైకోర్టును ఆశ్రయించి, తమపై కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం, కమిషన్ నివేదిక ఆధారంగా పరిపాలనా చర్యలు చేపట్టడాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది.
Published Date - 01:07 PM, Tue - 2 September 25 -
#Telangana
Kaleshwaram : కాళేశ్వరం అవకతవకలకు పూర్తిబాధ్యత కేసీఆర్‌దే..పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో సంచలన విషయాలు!
కమిషన్ వివరించిన ప్రకారం, కాళేశ్వరం ప్రాజెక్టులో చోటుచేసుకున్న అవకతవకలకు ప్రధాన బాధ్యత మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుది (కేసీఆర్) అని స్పష్టంగా పేర్కొంది. కేసీఆర్ ఆదేశాల వల్ల మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలలో భారీ సమస్యలు తలెత్తినట్లు కమిషన్ నివేదికలో వెల్లడైంది.
Published Date - 12:56 PM, Mon - 4 August 25 -
#Telangana
Cabinet Meeting : ‘కాళేశ్వరం’ నివేదిక పై చర్చించేందుకు నేడు కేబినెట్ భేటీ !
ఇప్పటికే ఈ నివేదిక సారాంశాన్ని సిద్ధం చేయడం కోసం ప్రత్యేకంగా నియమించబడిన ముగ్గురు సభ్యుల సీనియర్ అధికారుల కమిటీ ఆదివారం సాయంత్రం నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సమావేశమైంది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు కూడా హాజరై, సారాంశ నివేదిక తుది రూపును ఆమోదించారు.
Published Date - 11:09 AM, Mon - 4 August 25 -
#Telangana
kaleshwaram commission : కాళేశ్వరం కమిషన్ విచారణ నివేదిక ప్రభుత్వానికి సమర్పణ
అనంతరం రాహుల్ బొజ్జా సచివాలయానికి బయల్దేరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమార్ రామకృష్ణారావుకు నివేదికను అందించనున్నారు. ఈ కమిషన్‌ను 2024 మార్చి 14న తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి, భారతదేశపు తొలి లోక్‌పాల్‌గా సేవలందించిన జస్టిస్ పీనాకి చంద్ర ఘోష్ ఆధ్వర్యంలో విచారణ సాగింది.
Published Date - 12:42 PM, Thu - 31 July 25 -
#Telangana
Muralidhar Rao : ఏసీబీ అదుపులో విశ్రాంత ఈఎన్సీ మురళీధర్‌రావు
ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ ప్రాంతాల్లో మురళీధర్‌రావు నివాసం, బంధువులు మరియు సన్నిహితుల ఇళ్లలో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. మురళీధర్ రావు అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో నీటి పారుదల శాఖలో కీలక స్థానంలో కొనసాగుతూ అనేక ప్రాజెక్టుల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.
Published Date - 11:14 AM, Tue - 15 July 25 -
#Telangana
KCR: కేసీఆర్‌తో హరీశ్ రావు భేటీ..కాళేశ్వరం విచారణ నోటీసుల నేపథ్యంలో కీలక మంతనాలు!
హరీశ్ రావు గురువారం ఉదయం ఎర్రవల్లి గ్రామంలోని కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీకి గల ప్రధాన కారణం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం వ్యవహారమే. ఈ భారీ సాగునీటి ప్రాజెక్టు పనులపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని విచారణ కమిషన్ ప్రస్తుతం లోతుగా దర్యాప్తు చేస్తోంది.
Published Date - 03:16 PM, Thu - 22 May 25 -
#Speed News
KCR : మాజీ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు
కేసీఆర్‌కే కాకుండా, ఆయనతో పాటు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న తన్నీరు హరీశ్‌రావు, ఆర్థిక మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్‌లకు కూడా నోటీసులు అందినట్టు సమాచారం. కళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద నిర్మించబడిన అనేక బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలపై సదరు కమిషన్ విచారణ కొనసాగిస్తోంది.
Published Date - 01:42 PM, Tue - 20 May 25 -
#Telangana
Kaleshwaram Project : మరోసారి కాళేశ్వరం విచారణ కమిషన్ గడువు పొడిగింపు
తాజాగా జూలై నెలాఖరు వరకు ఈ కమిషన్‌కు గడువు విస్తరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే విచారణ తుదిదశకు చేరిన నేపథ్యంలో, తుది నివేదిక సిద్ధం చేసేందుకు ఈ గడువు అవసరమని అధికారులు భావిస్తున్నారు.
Published Date - 04:35 PM, Mon - 19 May 25