Government Actions
-
#Telangana
HYDRA : హైడ్రాను మరింత పటిష్టం చేయాలని ప్రభుత్వానికి వినతులు..
HYDRA : హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసే వారిపై చర్యలు తీసుకుంటున్న HYDRA (హైడ్రా) వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని భూ కబ్జాదారుల బాధితులు ప్రభుత్వాన్ని కోరారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు, HYDRA వారి భూములను కబ్జాదారుల నుంచి రక్షించే ఒక మంచి వ్యవస్థ అని అభిప్రాయపడారు.
Published Date - 10:03 AM, Thu - 20 February 25 -
#Telangana
AV Ranganath : ఎఫ్‌టీఎల్ నిర్ధారణతోనే సమస్యలకు పరిష్కారం..
AV Ranganath : ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 89 ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ.. నగరంతో పాటు ఓఆర్ ఆర్ పరిధిలోని చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్(ఎఫ్ టీఎల్) నిర్ధారణ పూర్తయితే చాలావరకు సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు.
Published Date - 08:46 PM, Mon - 20 January 25 -
#Telangana
AV Ranganath : ఆపరేషన్ మూసీతో హైడ్రాకు సంబంధం లేదు..
AV Ranganath : మూసీ నది ఒడ్డున జరుగుతున్న సర్వేలతో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని హైదరాబాద్ విపత్తు స్పందన, ఆస్తుల రక్షణ సంస్థ (హైడ్రా) కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. మూసీ నది ఒడ్డున ఉన్న ఇళ్లపై జరుగుతున్న సర్వేకు హైడ్రాకు సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు.
Published Date - 06:23 PM, Mon - 30 September 24