Devotional
-
#Devotional
వెన్నతో కృష్ణుడిని చేసి వశిష్ఠుడు ఆరాధించిన దివ్య మహిమగల క్షేత్రం.. ‘కృష్ణారణ్య క్షేత్రం’
కృష్ణుడిని ఎంతో మంది మహర్షులు ఆరాధించారు .. ఆ స్వామి సేవలో తరించారు. తన నామస్మరణలో .. తన కీర్తనల్లో తేలియాడే మహర్షులను స్వామి అనుగ్రహిస్తూ వచ్చాడు. అలా శ్రీకృష్ణుడు .. వశిష్ఠ మహర్షికి ప్రత్యక్షమైన క్షేత్రంగా ‘తిరుక్కణ్ణం గుడి’ కనిపిస్తుంది. ఈ క్షేత్రాన్నే ‘కృష్ణారణ్య క్షేత్రం’ అని కూడా పిలుస్తుంటారు. తమిళనాడు .. నాగపట్నం సమీపంలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. 108 దివ్య తిరుపతులలో ఒకటిగా ఈ క్షేత్రం అలరారుతోంది. ఇక్కడ వశిష్ఠమహర్షి వెన్నతో శ్రీకృష్ణుడి […]
Date : 24-12-2025 - 4:15 IST -
#Devotional
ఒకరిచ్చిన తాంబూలం మళ్ళీ ఇంకొకరికి ఇవ్వవచ్చా దోషము ఉంటుందా !
ఈ కాలం లో నోములు … వ్రతాలు ఎక్కువగా జరుగుతూ వుంటాయి. ఇరుగుపొరుగు ముత్తయిదువులంతా కలిసి ఒకరినొకరు ఆహ్వానించుకుంటూ నోములు … వ్రతాలు చేస్తుంటారు. అందువలన ఈ మాసంలో ప్రతి ఒక్క ఇల్లు ముత్తయిదువులతో కళకళలాడుతుంటుంది. ఇక నోముగానీ … వ్రతంగాని పూర్తయిన తరువాత పేరంటాలుగా వచ్చిన ముత్తయిదువులకు రెండు అరటి పండ్లను .. రెండు వక్కలను … రెండు తమలపాకుల్లో పెట్టి తాంబూలంగా ఇస్తుంటారు. కొందరు అరటిపండ్ల స్థానంలో కమలాకాయలను పెట్టి ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో […]
Date : 23-12-2025 - 5:00 IST -
#Devotional
లలితా దేవి అనుగ్రహం అందరికీ లభిస్తుందా.. అమ్మ మన దగ్గరకు రావాలంటే ఏం చేయాలి?
లలిత అమ్మవారు అందరి దగ్గరికి రాదు లేదా అందరూ ఆమెను పూజించలేరు అని ఎందుకు అంటారంటే పూర్వజన్మ సుకృతం: శాస్త్రాల ప్రకారం, “జన్మాంతర సహస్రేషు కృతపుణ్యైక లభ్యతే” – అంటే వేల జన్మల పుణ్యం ఉంటే తప్ప లలితా దేవి నామం నోటికి రాదు, ఆమె పూజ చేసే భాగ్యం కలగదు. అందుకే లలితా సహస్రనామ పారాయణ చేసేవారిని చాలా పుణ్యాత్ములుగా భావిస్తారు. అమ్మవారి పిలుపు : మనం అమ్మవారిని ఎంచుకోవడం కాదు, అమ్మవారే మనల్ని ఎంచుకుంటుంది […]
Date : 23-12-2025 - 4:00 IST -
#Devotional
ఈ విశ్వంలో అసలైన సౌందర్యం…నిజమైన వైభవం అంటే అది వేంకటేశ్వరస్వామి వారిదే ..
Sri Kalyana Venkateswara Swamy Temple : అనంతమైన ఈ విశ్వంలో అసలైన సౌందర్యం … నిజమైన వైభవం అంటే అది వేంకటేశ్వర స్వామిదే. ఆయన వెలసిన ప్రతి క్షేత్రం మోక్షాన్ని ప్రసాదించేదిగా కనిపిస్తుంది … ఆ క్షేత్రంలో అడుగుపెట్టినంతనే జీవితం సార్ధకమైనట్టుగా అనిపిస్తుంది. అలా ఆ కొండంత దేవుడు కొలువుదీరిన క్షేత్రం కృష్ణా జిల్లా ‘మంటాడ’లో దర్శనమిస్తుంది. ఈ క్షేత్రంలో స్వామివారు శ్రీదేవి – భూదేవి సమేతంగా కొలువైకనిపిస్తాడు. గర్భాలయంలో నిలువెత్తు విగ్రహాలు సుందరంగా … […]
Date : 20-12-2025 - 5:00 IST -
#Devotional
ధనుర్మాసం లో గోదాదేవి ఆలపించిన 30 తిరుప్పావై పాశురాలు ఇవే!
Dhanurmasam : శ్రావణ మాసం లక్ష్మీదేవి అమ్మవారికి.. కార్తీక మాసం శివకేశవులకు.. అలాగే ధనుర్మాసం.. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమని పురాణాలు చెబుతున్నాయి. అంతే కాకుండా దక్షిణాయణ పుణ్య కాలానికి చివర, ఉత్తరాయణ పుణ్య కాలం ప్రారంభానికి మధ్య ఉండే ఈ ధనుర్మాసంలో మహాలక్ష్మీదేవిని, శ్రీమహావిష్ణువును పూజిస్తారు. ముఖ్యంగా గోదాదేవి పాశురాలు చదువుతారు. ధనుర్మాసం వ్రతం ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో గోదాదేవి రచించిన 30 పాశురాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. గోదాదేవిగా జన్మించిన ఆండాళ్ అమ్మవారు భగవంతుడినే భర్తగా […]
Date : 20-12-2025 - 4:15 IST -
#Devotional
కుక్కల కోసం ప్రత్యేక ఆలయం.. ఎక్కడ ఉందంటే?
ఈ ఆలయం వెనుక ఒక ఆశ్చర్యకరమైన కథ ప్రచారంలో ఉంది. గ్రామంలో ప్రధాన దేవత అయిన కెంపమ్మ దేవి ఆలయాన్ని నిర్మిస్తున్న సమయంలో రెండు కుక్కలు అక్కడకు వచ్చి ఉండటం ప్రారంభించాయి.
Date : 18-12-2025 - 12:41 IST -
#Devotional
2026 నూతన సంవత్సర లో ఇలా దైవ మంత్రాలతో కలిపి చెప్పేయండి!
New Year 2026 : నూతన సంవత్సరం 2026 వేడుకలకు మరెంతో సమయం లేదు. మరికొద్ది రోజుల్లో 2025కు వీడ్కోలు పలికి.. 2026 కొత్త ఏడాదికి Grand Welcome చెప్పేందుకు ప్రపంచమంతా సిద్ధమవుతోంది. 2025 ఏడాది మిగిల్చిన మంచి, చెడు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ.. కోటి ఆశలతో కొత్త సంవత్సరం 2026 నూతన సంవత్సరానికి స్వాగతం పలకనున్నారు. ఇప్పటికే చాలా మంది న్యూ ఇయర్ గిఫ్ట్స్ ఐడియాస్ కోసం ఆలోచనలు చేసేస్తున్నారు. అలాగే నూతన సంవత్సరం 2026 […]
Date : 17-12-2025 - 6:00 IST -
#Devotional
Mahashivratri 2026 : 2026లో మహాశివరాత్రి వచ్చే తేదీ ఇదే.. పండుగ మహత్యం తెలుసా!
శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో శివరాత్రి కూడా ఒకటి. శివపురాణంలో మహాశివరాత్రికి సంబంధించి అనేక కథలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం మాఘ మాసంలోని కృష్ణ పక్షం చతుర్దశి రోజున మహాశివరాత్రి వస్తుంది. ఈ విశిష్టమైన రోజున శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల శుభాలు జరుగుతాయని శాస్త్రవచనం. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది 2026లో మహాశివరాత్రి పండుగ ఏ రోజున వచ్చిందో తెలుసుకుందాం.. మహాశివరాత్రి హిందూ సంప్రదాయంలో ముఖ్యంగా శివ […]
Date : 03-12-2025 - 6:00 IST -
#Devotional
Gita Jayanti : గీతా జయంతి ఎప్పుడంటే ? భగవద్గీత ప్రాముఖ్యత ఇదే !
హిందువులు జరుపుకునే ప్రధానమైన పండుగల్లో గీతా జయంతి కూడా ఒకటి. భగవద్గీత పుట్టిన రోజుగా ఈ గీతా జయంతిని జరుపుకుంటారు. ప్రతియేటా మార్గశిర మాసం శుక్ల పక్ష ఏకాదశి రోజు గీతా జయంతిని జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది గీతా జయంతి ఎప్పుడు? గీతా జయంతి 2025 తేదీ, తిథి, గీతా జయంతి విశిష్టత వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం.. హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టినరోజును గీతా జయంతి జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా హిందూ పంచాంగం […]
Date : 28-11-2025 - 2:18 IST -
#Devotional
Skanda Shashthi 2025: స్కంద షష్ఠి వ్రతం గురించి మీకు తెలుసా? ముహూర్తం, పూజా విధానం ఇదే!
స్కంద షష్ఠి రోజున ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఆ తరువాత పూజా స్థలాన్ని శుభ్రం చేసి భగవాన్ శివుడు, మాతా పార్వతి, గణేశుడు, కార్తికేయ భగవాన్ విగ్రహాలను లేదా చిత్రపటాలను ప్రతిష్టించండి.
Date : 24-11-2025 - 3:30 IST -
#Devotional
Maa Lakshmi Blessings: ఇంటి నుంచి లక్ష్మీదేవిని దూరం చేసే అలవాట్లు ఇవే!
లక్ష్మీదేవి అపరిశుభ్రత, అస్తవ్యస్తత, సోమరితనం ఉన్న చోట నివసించదు. మనిషి జీవితంలో ఈ మూడు అలవాట్లే ధనాన్ని నిలవనీయవు.
Date : 20-11-2025 - 8:25 IST -
#Devotional
Zodiac Signs: కర్ణుడి లక్షణాలు ఎక్కువగా ఈ రాశులవారిలోనే ఉంటాయట!
వృశ్చిక రాశికి అధిపతి అంగారకుడు (కుజుడు) అయినప్పటికీ ఇది జల తత్వ రాశి కావడం వలన వీరు అధిక భావోద్వేగాలను కలిగి ఉంటారు. ఈ రాశి వారు ధైర్యం, తెలివితేటలు, ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు. వీరు చాలా సాహసోపేతంగా ఉంటారు.
Date : 08-11-2025 - 9:54 IST -
#Devotional
Kartik Purnima: రేపే కార్తీక పౌర్ణమి.. ఏ రాశి వారు ఎలాంటి వస్తువులు దానం చేయాలో తెలుసా?
ధనుస్సు రాశి, మకర రాశి వారు శెనగపప్పు, అరటిపండు, పసుపు వస్త్రాలు, కుంకుమపువ్వు, పసుపు, మొక్కజొన్న దానం చేయడం ద్వారా సంతానానికి అదృష్టం (సౌభాగ్యం) లభిస్తుంది.
Date : 04-11-2025 - 10:09 IST -
#Devotional
Kartik Purnima : నవంబర్ 1 పవిత్రమైన దేవుత్తని ఏకాదశి.. కార్తీక మాసం!
నవంబర్ 1వ తేదీ దేవుత్తని ఏకాదశి వ్రతం ఆచరిస్తారు. ఈరోజున శ్రీమహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొంటాడని విశ్వాసం. ఈరోజు నుంచే శుభకార్యాలు ప్రారంభమవుతాయట. ఇందుకు ఆరంభ సూచకంగా మరుసటి రోజు నవంబర్ 2న తులసి వివాహం చేస్తారు. చాలా మంది ఉపవాస దీక్ష కూడా ఆచరిస్తారు. ఈరోజున శ్రీమహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తే విశేషమైన పుణ్యఫలం ఉంటుందని విశ్వాసం. ఈ నేపథ్యంలో దేవుత్తని ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకుందాం.. హిందువులకు ఎంతో పవిత్రమైన మాసం […]
Date : 01-11-2025 - 10:45 IST -
#Devotional
Karthika Masam : కోటి సోమవారం .. శ్రవణ నక్షత్రం విశిష్టత.!
పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు ఎంతో విశిష్టమైనవిగా భావిస్తారు. ముఖ్యంగా కార్తీక మాసం కోటి సోమవారం రోజుకు ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ఈ రోజున చేసే శివకేశవుల పూజకు, ఉపవాసానికి, దానాలకు రెట్టింపు ఫలితాలు ఉంటాయని శాస్త్రవచనం. ఈనేపథ్యంలో ఈ ఏడాది కోటి సోమవారం శ్రవణ నక్షత్రం ఎప్పుడు వచ్చింది.. పూజా విధానం, విశిష్టత వంటి విషయాలు వివరంగా తెలుసుకుందాం.. శివారాధనకు విశేషమైన కార్తీక మాసంలో సోమవారాలకు ఎంతో విశిష్టత ఉంది. అందులోనూ కార్తీక మాసం కోటి సోమవారం […]
Date : 30-10-2025 - 12:04 IST