Community Appeal
-
#Telangana
HYDRA : హైడ్రాను మరింత పటిష్టం చేయాలని ప్రభుత్వానికి వినతులు..
HYDRA : హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసే వారిపై చర్యలు తీసుకుంటున్న HYDRA (హైడ్రా) వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని భూ కబ్జాదారుల బాధితులు ప్రభుత్వాన్ని కోరారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు, HYDRA వారి భూములను కబ్జాదారుల నుంచి రక్షించే ఒక మంచి వ్యవస్థ అని అభిప్రాయపడారు.
Date : 20-02-2025 - 10:03 IST