Academic Calendar
-
#Andhra Pradesh
Dussehra holidays: అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. విద్యార్థులకు దసరా సెలవులు ఎప్పటి నుండో తెలుసా?!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం, దసరా సెలవులు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రకటించారు. మొత్తం 9 రోజులు విద్యార్థులకు సెలవులు లభించనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సెలవుల వ్యవధి మరింత ఎక్కువగా ఉండనుంది. అక్కడి అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు ఉంటాయి. ఇది మొత్తం 13 రోజులపాటు వరుసగా సెలవులు అనే విధంగా ఉంటుంది.
Date : 17-08-2025 - 2:20 IST