HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Yuvraj Singh Backs Rishabh Pant To Become Next India Test Captain

Rishab Panth : టెస్ట్ కెప్టెన్ గా అతనే సరైనోడు : యువీ

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ తో కెప్టెన్ గా విరాట్ కోహ్లీ శకానికి తెరపడింది. బీసీసీఐ తప్పించకముందే సారథ్యానికి కోహ్లీ గుడ్ బై చెప్పేశాడు. దీంతో అతని అభిమానులు చాలా నిరాశకు గురయ్యారు.

  • Author : Hashtag U Date : 18-01-2022 - 1:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Yuvi Rishab
Yuvi Rishab

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ తో కెప్టెన్ గా విరాట్ కోహ్లీ శకానికి తెరపడింది. బీసీసీఐ తప్పించకముందే సారథ్యానికి కోహ్లీ గుడ్ బై చెప్పేశాడు. దీంతో అతని అభిమానులు చాలా నిరాశకు గురయ్యారు. టీ 20 వరల్డ్ కప్ కుముందు మూడు ఫార్మాట్లకు నాయకత్వం వహించిన విరాట్ ఇప్పుడు ఆటగాడిగా గా మాత్రమే జట్టులో కొనసాగనున్నాడు. కాగా కోహ్లీ హఠాత్తుగా తప్పుకోవడంతో ఇప్పుడు అతని స్థానంలో తదుపరి కెప్టెన్ ఎవరనే విషయంపై చర్చ మొదలైంది. ఇప్పటికే టీ20, పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌ శర్మకే టెస్టు పగ్గాలు కూడా అప్పగించే అవకాశాలు ఉన్నాయని చాలా మంది భావిస్తున్నారు. అయితే వయసు, ఫిట్‌నెస్‌ రోహిత్ కు అడ్డంకిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా మందీ మాజీ ఆటగాళ్ళు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ కాకుండా కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ పేర్లు జట్టు కెప్టెన్ రేసులో వినిపిస్తున్నాయి. ఇప్పటికే దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కోహ్లి వారసుడిగా షభ్ పంత్ అయితే బాగుంటుందంటున్నాడు.

తాజాగా టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కూడా రిషబ్ పంత్ కే మద్ధతు పలికాడు.రిషబ్ కు టెస్ట్ కెప్టెన్సీ అప్పగించే విషయమై గవాస్కర్ తో యువీ ఏకీభవించాడు. వికెట్ల వెనక ఉంటూ అతను ఆటను బాగా అధ్యయనం చేస్తాడని, టీమిండియాను మెరుగ్గా ముందుకు నడిపిస్తాడని యువీ వ్యాఖ్యానించాడు. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన ఆఖరు టెస్టులో అందరూ చేతులెత్తేయగా పంత్ సెంచరీతో కదం తొక్కాడు. అంతకుముందు ఆస్ట్రేలియా పర్యటనలోనూ మెరుపు ఇన్సింగ్స్ లు ఆడి టీమిండియాకు టెస్ట్ సిరీస్ విజయం అందించాడు. అయితే షాట్ల ఎంపికలో కొన్ని సార్లు నిర్లక్ష్యంగా ఆడతాడన్న విమర్శలు పంత్ పై ఉన్నాయి. అనుభవం వచ్చే కొద్దీ నేర్చుకుంటాడని మాజీలు విశ్లేషిస్తున్నారు. కాగా ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను సమర్థవంతంగా లీడ్ చేస్తున్నాడు పంత్.శ్రేయస్ అయ్యర్ స్థానంలో 2021 సీజన్ సారథ్య బాధ్యతలను చేపట్టి పాయింట్ల పట్టికలో ఢిల్లీని అగ్రస్థానానికి తీసుకెళ్లాడు. ఈ అనుభవం కూడా కెప్టెన్సీ రేసులో అతనికి అడ్వాంటేజ్ అవుతుందని యువీ అభిప్రాయపడ్డాడు. అయితే కొంతకాలం వైస్ కెప్టెన్ గా కొనసాగిస్తే రాటు దేలేందుకు వీలుంటుందన్నది మరికొందరి వాదన. ఈ నేపథ్యంలో రోహిత్ కు కొన్నాళ్ళు డిప్యూటీగా పంత్ ను నియమిస్తే ఫ్యూచర్ కెప్టెన్ గా తీర్చిదిద్దే అవకాశముంటుందని వారి అభిప్రాయం. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెలక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Rishabh Pant
  • virat kohli
  • yuvaraj singh

Related News

Smriti Mandhana created history by surpassing Rohit Sharma to become India's leading T20I run scorer

Smriti Mandhana: విరాట్ కోహ్లీ, రోహిత్ లను అధిగమించి స్మృతి మంధాన రికార్డ్ ..!

భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. టీ20 అంతర్జాతీయ ఫార్మాట్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఈ క్రమంలో భారత పురుషుల జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ఆమె అధిగమించింది. దక్షిణాఫ్రికాతో శుక్రవారం డర్బన్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో మంధాన ఈ అరుదైన మైలురాయిని అందుకుంది. A 𝗺𝗲𝗴𝗮 𝗺𝗶𝗹𝗲

  • Virat Kohli

    నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

  • Virat Kohli Injury

    ఐపీఎల్ 2026.. విరాట్ కోహ్లీకి గాయం?

Latest News

  • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

  • లాస్ ఏంజెలెస్‌లో మహిళ అరెస్ట్.. ఇరాన్‌కు అక్రమంగా డ్రోన్ సప్లయ్.

  • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

  • Dwacra Womens : డ్వాక్రా మహిళలకు గొప్ప శుభవార్త తెలిపిన ఏపీ సర్కార్ !

  • Emergency Landing : విమానంలో సాంకేతిక సమస్య.. భయంతో వెక్కి వెక్కి ఏడ్చిన ప్రయాణికులు

Trending News

    • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd