Jadeja-Manjrekar:నాతో మాట్లాడతావా…ఖచ్చితంగా… వైరల్ గా జడ్డూ,మంజ్రేకర్ సంభాషణ
కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్, భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మధ్య మనస్పర్థలు తొలగిపోయినట్టేనని అర్థమవుతోంది. వీరిద్దరి మధ్య భారత్, పాక్ మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
- Author : Naresh Kumar
Date : 29-08-2022 - 3:38 IST
Published By : Hashtagu Telugu Desk
కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్, భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మధ్య మనస్పర్థలు తొలగిపోయినట్టేనని అర్థమవుతోంది. వీరిద్దరి మధ్య భారత్, పాక్ మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజానికి గత కొంత కాలంగా మంజ్రేకర్-రవీంద్ర జడేజా మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. 2019 వన్డే ప్రపంచకప్ సమయంలో రవీంద్ర జడేజాని అరకొర క్రికెటర్ అని మంజ్రేకర్ కామెంట్ చేయడం వివాదానికి కారణమైంది. తర్వాత మంజ్రేకర్ వాఖ్యలకు జడేజా గట్టి కౌంటర్ ఇచ్చాడు.
నా కెరీర్‌లో నువ్వు ఆడిన మ్యాచ్‌లకంటే నేను రెట్టింపు ఆడాను… ఇంకా ఆడుతూనే ఉన్నాను అంటూ ట్విట్ చేశాడు. మొదట మనుషులను గౌరవించడం నేర్చుకోండి. ఇకనైనా ఇలాంటివి ఆపితే మంచిది అంటూ ట్విటర్ వేదికగా బదులిచ్చాడు. ఇక అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మాటల యుద్దం నడుస్తూనే ఉంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో విఫలమైన తర్వాత జడేజాపై మళ్ళీ మంజ్రేకర్ విమర్శలు గుప్పించాడు. జడ్డూకు భారత జట్టులో చోటు దక్కడం కష్టమంటూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. దీనికి కౌంటర్‌గా జడేజా ఏమీ మాట్లాడకున్నా… అభిమానులు మాత్రం మంజ్రేకర్‌పై మండిపడ్డారు. ఆటగాడి ఆత్మవిశ్వాసం దెబ్బతీయొద్దంటూ అతనికి సూచించారు. తాజాగా వీరిద్దరూ భారత్,పాక్ మ్యాచ్ సందర్భంగా ఎదురుపడాల్సి వచ్చింది.
Success makes you the bigger person 😄@imjadeja pic.twitter.com/RhqqGFEL0b
— Nachiket Kher (@NachiketKher) August 28, 2022
కామెంటటర్‌గా విధులు నిర్వహిస్తున్న మంజ్రేకర్ మ్యాచ్ ముగిసిన తర్వాత జడేజాను ఇంటర్యూ చేశాడు. ఈ క్రమంలో మొదటి ప్రశ్నగా మంజ్రేకర్ జడ్డూ నాతో మాట్లాడతావా అని అడగ్గా… నవ్వుతూ స్పందించిన జడేజా ఖచ్చితంగా మాట్లాడతా అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం వీరి సంభాషణ వైరల్‌గా మారింది. పాక్‌తో మ్యాచ్‌లో జడేజా కూడా రాణించాడు. సూర్యకుమార్ యాదవ్‌లో 36 పరుగుల పార్టనర్‌షిప్ నెలకొల్పిన జడేజా.. తర్వాత పాండ్యాతో కలిసి విజయానికి చేరువ చేశాడు. చివర్లో జడేజా ఔటైనపప్పటకీ పాండ్యా విజయాన్ని పూర్తి చేశాడు.