WTC Final Weather: డబ్ల్యూటీసీ ఫైనల్.. చివరి రోజు వర్షం ముప్పు..! డ్రా అయితే విజేత ఎవరు..?
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ (WTC Final Weather)కు నాలుగు రోజులు పూర్తయ్యాయి. చివరి రోజు టీమిండియా విజయానికి 280 పరుగులు చేయాల్సి ఉంది.
- By Gopichand Published Date - 11:09 AM, Sun - 11 June 23

WTC Final Weather: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ (WTC Final Weather) నాలుగు రోజులు పూర్తయ్యాయి. చివరి రోజు టీమిండియా విజయానికి 280 పరుగులు చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే వాతావరణానికి సంబంధించిన అప్‌డేట్ బయటకు వచ్చింది. ఫైనల్ ఐదో రోజు వర్షం కురువడం ఖాయమని రిపోర్టులో తెలుస్తోంది.
పరుగుల ఛేదనలో ఉన్న టీమిండియా నాలుగో రోజు 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. రోజు ముగిసే సమయానికి విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే అజేయంగా వెనుదిరిగారు. కోహ్లీ (44), రహానే (20) పరుగులు చేశారు. అదే సమయంలో ఐదో రోజు ఆటను కోహ్లీ, రహానే ప్రారంభించనున్నారు. అయితే ఈలోగా వర్షం ముప్పు పొంచి ఉంది.
Also Read: Wrestlers: ఇద్దరు మహిళా రెజ్లర్ల నుండి సాక్ష్యాలను కోరిన ఢిల్లీ పోలీసులు
వాతావరణం ఎలా ఉంది..?
‘అక్యూవెదర్’ ప్రకారం.. మ్యాచ్ ఐదో రోజు అంటే జూన్ 11న లండన్‌లో 90 శాతం వర్షం పడే అవకాశం ఉంది. ఆకాశంలో 55 శాతం మేఘాలు కమ్ముకున్నట్లు అంచనా కూడా ఉంది. దీని ప్రకారం వర్షం కారణంగా ఐదో రోజు ఆటకు ఆటంకం ఏర్పడవచ్చు. అదే సమయంలో రోజులో కనిష్ట ఉష్ణోగ్రత 17, గరిష్టంగా 27 డిగ్రీలు ఉంటుంది. కాగా గంటకు దాదాపు 28 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. అయితే జూన్ 12ని రిజర్వ్ డేగా ఉంచారు. అయితే రిజర్వు రోజు కూడా 65 శాతం వర్షం పడే అవకాశం ఉంది.
ఫైనల్ డ్రా అయితే విజేత ఎవరు?
ఐదో రోజు వర్షం కారణంగా ఆట గంటకు పైగా ఆలస్యమైతే మ్యాచ్ చివరి రోజు రిజర్వ్ డేకి మార్చబడుతుంది. రిజర్వ్ డే రోజు కూడా వర్షం కారణంగా మ్యాచ్ ఫలితం రాకపోతే ఇరు జట్లను ఉమ్మడి విజేతలుగా ప్రకటిస్తారు. అదే సమయంలో మ్యాచ్ టై అయినప్పటికీ ఇరు జట్లను విజేతలుగా ప్రకటిస్తారు.