Worlds Richest Cricketer : 22 ఏళ్లకే రిటైర్ అయిన క్రికెటర్.. రూ.70వేల కోట్ల ఆస్తి
డొమెస్టిక్ క్రికెట్‌లో మధ్యప్రదేశ్ టీమ్ తరఫున ఆర్యమన్(Worlds Richest Cricketer) ఆడారు.
- By Pasha Published Date - 03:31 PM, Tue - 3 December 24

Worlds Richest Cricketer : మన దేశంలో రిచెస్ట్ క్రికెటర్ ఎవరు ? అంటే.. కోహ్లీ, ధోనీ, సచిన్ పేర్లను చాలామంది చెబుతుంటారు. వాస్తవానికి వాళ్ల కంటే రిచెస్ట్ ప్లేయర్ ఒకాయన ఉన్నాడు. ఆయన పేరే.. ఆర్యమన్ బిర్లా. ఆస్తి విషయంలో ఆర్యమన్ దరిదాపుల్లో కూడా ఏ క్రికెటర్ లేకపోవడం గమనార్హం. ఈయన అనూహ్యంగా 22 ఏళ్లకే క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. వ్యాపారంపై ఫోకస్ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆర్యమన్ బిర్లా ఎవరు ? ఆస్తులు ఎక్కడివి ?
- ఆర్యమన్ బిర్లా.. ప్రముఖ వ్యాపారవేత్త కుమార మంగళం బిర్లా కుమారుడు.
- ఈయన 1997లో జన్మించారు.
- ఆర్యమన్‌కు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం. అందుకే క్రికెటర్‌గా మారారు.
- 2017లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి ఆర్యమన్ అరంగేట్రం చేశారు.
- బ్యాటింగ్ టాలెంట్‌తో మంచిపేరు సంపాదించారు.
- డొమెస్టిక్ క్రికెట్‌లో మధ్యప్రదేశ్ టీమ్ తరఫున ఆర్యమన్(Worlds Richest Cricketer) ఆడారు.
- ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఆర్యమన్ 9 మ్యాచులు, లిస్ట్-ఏలో 4 మ్యాచులు ఆడారు. 414 రన్స్ చేశారు. ఆయన హయ్యెస్ట్ స్కోరు 103 నాటౌట్.
- మధ్యప్రదేశ్ టీమ్ తరఫున ఆడిన ఆర్యమన్.. బెంగాల్‌పై సెంచరీ చేశారు.
- ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ తరఫున ఆర్యమన్ ఆడారు.అయితే తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయారు.
- ఆర్యమన్ గాయాలతో ఇబ్బంది పడుతూ 2019లో క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు.
- ప్రస్తుతం ఆయన తమ కుటుంబ బిజినెస్‌ను చూసుకుంటూ బిజీగా ఉన్నారు.
- ఆదిత్య బిర్లా మేనేజ్‌మెంట్ కార్పొరేషన్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌కు డైరెక్టర్‌గా ఆర్యమన్ పనిచేస్తున్నారు. బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ లిమిటెడ్‌కు డైరెక్టర్‌గా ఆర్యమన్ ఉన్నారు.
- ఆర్యమన్ ఆస్తుల విలువ దాదాపు రూ.70 వేల కోట్లు.
- సచిన్ ఆస్తి రూ.1,100 కోట్లు. కోహ్లీ ఆస్తి రూ.900 కోట్లు. ధోనీ ఆస్తి రూ.800 కోట్లు.