Boxing Day Test : బెయిల్స్ మార్చడం వెనుక ఉద్దేశం ఏంటి?
Boxing Day Test : ఈ మ్యాచ్ రెండో రోజు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను అనుకరిస్తూ కనిపించాడు
- By Sudheer Published Date - 04:04 PM, Sat - 28 December 24

భారత్, ఆస్ట్రేలియాతో పాటు పాకిస్థాన్, దక్షిణాఫ్రికా మధ్య కూడా బాక్సింగ్ డే టెస్టు (Boxing Day Test) జరుగుతోంది. పాక్-దక్షిణాఫ్రికా జట్ల (Pakistan and South Africa) మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ రెండో రోజు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను అనుకరిస్తూ కనిపించాడు. వాస్తవానికి బాబర్ సిరాజ్‌ను కాపీ కొట్టి స్టంప్ బెయిల్స్ (Bails) ను మార్చాడు.
గబ్బాలో భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా మహ్మద్ సిరాజ్ స్టంప్ బెయిల్‌లను మార్చిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా బ్యాటర్ మార్కస్ లబుషేన్ ఏకాగ్రతని చెదరగొట్టేందుకు ఉద్దేశపూర్వకంగానే మహ్మద్ సిరాజ్ వికెట్లపై ఉన్న బెయిల్స్‌ను మార్చాడు. అయితే నెక్స్ట్ ఓవర్లోనే లబుషేన్ అవుట్ అయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న మెల్‌బోర్న్ టెస్టులోనూ సిరాజ్ అదే పని చేశాడు. ఇన్నింగ్స్ 43వ ఓవర్ సమయంలో మహ్మద్ సిరాజ్ స్ట్రైకర్స్ ఎండ్‌కు వెళ్లి బెయిల్స్ మార్చాడు. దీని తర్వాత ఉస్మాన్ ఖవాజా భారత పేసర్ బుమ్రాకు బలయ్యాడు. దీంతో బాబర్ ఆజం కూడా డిఎస్పీ సిరాజ్ ట్రిక్ ని ఫాలో అయ్యాడు.
సెంచూరియన్ టెస్టు రెండో రోజు బాబర్ ఆజం స్టంప్ బెయిల్స్‌ను మార్చడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఫీల్డింగ్ జట్టు ఆటగాళ్లు బ్యాట్స్‌మన్ దృష్టిని మరల్చడానికి ఇలా చేస్తారు. ఇలాంటి ఘటనలు ఇది వరకు చాలానే జారిగాయి. గతంలో కోహ్లీ అదే పని చేసి వార్తల్లో నిలిచాడు. కాగా బాబర్ ఆజం మరోసారి బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు కేవలం 211 పరుగులకే పరిమితమైంది. కమ్రాన్ గులామ్ భారీ ఇన్నింగ్స్ ఆడాడు. 8 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 54 పరుగులు చేశాడు. ఇది కాకుండా ఆ జట్టులోని మరే ఇతర బ్యాట్స్‌మెన్ కూడా హాఫ్ సెంచరీ సాధించలేకపోయారు.
Read Also : Kadapa : అధికారులపై దాడి చేస్తే వదిలేది లేదు: పవన్ కళ్యాణ్