Kadapa : అధికారులపై దాడి చేస్తే వదిలేది లేదు: పవన్ కళ్యాణ్
ఎంపిడివో పై దాడి చేసిన 12 మంది వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి అనుచరులకు కూడా వార్నింగ్ ఇచ్చారు. విధులకు ఆటంకం కలిగిస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు.
- By Latha Suma Published Date - 02:19 PM, Sat - 28 December 24

Kadapa: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడపలో కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపిడిఓ జవహర్ బాబును పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. అధికారులపై దాడి చేస్తే వదిలేది లేదని..వైసీపీ నేతల కళ్ళు నెత్తిన పెట్టుకోని ఉన్నారు కిందకి దించుతానంటూ హెచ్చరించారు. ఎంపిడివో పై దాడి చేసిన 12 మంది వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి అనుచరులకు కూడా వార్నింగ్ ఇచ్చారు. విధులకు ఆటంకం కలిగిస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు.
అహంకారం తీస్తాం.. తోలు తీసి కింద కూర్చోబెడతాం మీకు -డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ #ChandrababuNaidu #Pawankalyan #AndhraPradesh #HashtagU pic.twitter.com/VtVCUI09Z0
— Hashtag U (@HashtaguIn) December 28, 2024
అధికారుల పై దాడులు గత ప్రభుత్వం లాగా వదిలేది లేదన్నారు. దాడిపై అన్నమయ్య జిల్లా కలెక్టర్ స్పందించిన తీరు హర్షణీయం అన్నారు. సుదర్శన్ రెడ్డి లాయర్ అయినా తప్పు చేస్తే ఏ చట్టం నిన్ను రక్షించలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. పరారీ లో ఉన్న వాళ్ళను వెంటనే పట్టుకోవాలని తేల్చి చెప్పారు. ఎంపిడిఓ జవహర్ బాబు కుటుంబానికి ధైర్యం చెప్పి..అండగా ఉంటానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.
విధి నిర్వహణలో ఉన్న జవహర్ బాబుపై వైసీపీ నేత దాడి చేయడం అప్రజాస్వామిక చర్య మండిపడ్డారు. ఇటువంటి దౌర్జన్యాలకు, రౌడీ చర్యలకు కూటమి ప్రభుత్వంలో తావు లేదని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. ఎంపీడీవోపై జరిగిన దాడి గురించి అధికారులతో పవన్ కళ్యాణ్ చర్చించారు. దాడికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత ఎంపీడీవోకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. జవహర్ బాబుపై దాడి చేసినవారికి రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్లా ఏ మాత్రం గౌరవం లేదని అర్థం అవుతూందన్నారు. దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా బలమైన సంకేతం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో చోటు చేసుకున్న దాడిపై విచారణ చేయడంతోపాటు ఎంపీడీవో ఆరోగ్యం గురించి నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ను డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించారు.
Read Also: Nitish Kumar Reddy : నితీష్ రెడ్డి పై సీఎం చంద్రబాబు ప్రశంసలు