Shreyas Iyer : శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ పై జాఫర్ ఫైర్
ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా బుధవారం ..
- By Naresh Kumar Published Date - 04:12 PM, Thu - 31 March 22

ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా బుధవారం రాత్రి కోల్ కత్తా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత కేకేఆర్ నిర్దేశించిన 129 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో దినేష్ కార్తీక్ ఓ సిక్స్, ఫోర్ కొట్టి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు..
అయితే ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ విధానంపై టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ మండిపడ్డాడు. ఎడమ చేతి వాటం బ్యాటర్లను చేతిలో వరుణ్ చక్రవర్తి ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్న సమయంలో పార్ట్ టైమ్ స్పిన్నర్ నితీశ్ రాణా చేతికి బంతిని ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించాడు. ఫుల్ ఫిట్ నెస్ సాదించని ఆండ్రీ రసెల్‌కు బదులు నితీష్ రానాకు బంతిని ఇస్తే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు.. ఈ అంశంపై జాఫర్ మాట్లాడుతూ.. శ్రేయస్ అయ్యర్ నితీశ్ రాణా చేతికి బంతిని ఇవ్వకపోవడం నన్ను షాక్ కు గురి చేసింది. రసెల్ ఇబ్బంది పడుతున్న సమయంలో నితీష్ రానాను ఉపయోగించుకోవాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఇదిలావుంటే.. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన వరుణ్ చక్రవర్తి 33 పరుగులు సమర్పించుకోగా… రసెల్ 2.2 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చుకున్నాడు.