world cup 2023: 20 ఏళ్ళ పగ .. గంగూలీ రివెంజ్ రోహిత్ తీరుస్తాడా?
2023 ప్రపంచకప్ చివరి దశకు చేరింది. తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీమిండియా ఫైనల్ కు చేరింది. ఇక రెండో సెమీఫైనల్ లో సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా గెలిచి ఫైనల్ కు చేరింది.
- By Praveen Aluthuru Published Date - 03:52 PM, Fri - 17 November 23

world cup 2023: 2023 ప్రపంచకప్ చివరి దశకు చేరింది. తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీమిండియా ఫైనల్ కు చేరింది. ఇక రెండో సెమీఫైనల్ లో సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా గెలిచి ఫైనల్ కు చేరింది. దీంతో టీమిండియా , ఆస్ట్రేలియా నవంబర్ 19న మధ్యాహ్నం 2 గంటలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాయి. టైటిల్ గెలవాలనే ఉద్దేశ్యంతో ఇరు జట్లు రంగంలోకి దిగనున్నాయి.
వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఇంతకుముందు 1983 మరియు 2011లో టీమ్ ఇండియా టైటిల్ గెలుచుకుంది, అయితే 2003 ఫైనల్‌లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో 20 ఏళ్ల ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో రోహిత్ సేన రంగంలోకి దిగనుంది. 20 ఏళ్లకు ముందు 2003లో ఈ రెండు జట్లు వరల్డ్ కప్ ఫైనల్స్ ఆడాయి. ఆ నాడు టీమిండియాకు కెప్టెన్ గా గంగూలీ వ్యవహరించాడు. అస్ట్రేలియా కెప్టెన్ గా రికి పాంటింగ్ ఉన్నాడు.లీగ్ స్టేజ్ లో అదరగొట్టిన టీమ్ ఇండియా ఫైనల్స్ లో ఆసీస్ చేతిలో ఓడి కప్పు దూరం చేసుకుంది. ఇది జరిగి ఇరవై ఏళ్ళవుతుంది. మరి 20 ఏళ్ల పగను రోహిత్ తీర్చుకుంటాడా చూడాలి. నిజానికి ఈ ఏడాది వరల్డ్ కప్ లో టీమిండియా అదరగొట్టింది. రోహిత్ కెప్టెన్సీ లో భారత్ పటిష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియా బలంగా కనిపిస్తుంది.
ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం స్టార్ స్పోర్ట్స్ యొక్క వివిధ నెట్‌వర్క్‌లతో పాటు డీడీ స్పోర్ట్స్‌లో చూడవచ్చు. డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారాన్ని ఉచితంగా చూడవచ్చు
Also Read: 3000 New Trains : 3వేల కొత్త రైళ్లు.. 1000 కోట్ల మంది ప్రయాణికులు