Team India Coach: హెడ్ కోచ్ రేసులో వీరేంద్ర సెహ్వాగ్
ప్రపంచకప్ ముగియడంతో పాటు హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల పదవికాలం కూడా పూర్తయింది.దీంతో టీమిండియా తదుపరి హెడ్ కోచ్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. నిజానికి మరోసారి జట్టుకు హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కొనసాగాలి అని అభిమానులు కోరుకుంటూ ఉన్నారు
- By Praveen Aluthuru Published Date - 07:30 PM, Thu - 23 November 23

Team India Coach: ప్రపంచకప్ ముగియడంతో పాటు హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల పదవికాలం కూడా పూర్తయింది. దీంతో టీమిండియా తదుపరి హెడ్ కోచ్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. నిజానికి మరోసారి జట్టుకు హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కొనసాగాలి అని అభిమానులు కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే రాహుల్ ద్రావిడ్ కోచ్గా అంతలా సక్సెస్ అయ్యాడు. కానీ రాహుల్ ద్రావిడ్ మరోసారి హెడ్ కోచ్ గా పదవి బాధ్యతలు చేపట్టేందుకు రెడీగా లేడని బీసీసీఐ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ రేసులో ముగ్గురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ రేసులో ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ చైర్మన్గా కొనసాగుతున్న వివిఎస్ లక్ష్మణ్ తో పాటు టీమిండియా మాజీ ఆటగాడు డేర్ అండ్ డాష్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, అండ్ మాజీ కోచ్ అనిల్ కుంబ్లే పేర్లు వినిపిస్తున్నాయి. గతంలో కుంబ్లే ఏడాది పాటు టీమ్ ఇండియాకు కోచ్ గా పని చేసిన అనుభవం ఉంది. ఇక సెహ్వాగ్ కోచ్గా వస్తే టీమిండియాలో మరింత దూకుడు పెరుగుతుంది. మరి ఎవరు కోచ్ గా వస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.
Also Read: Viral Photo: ఒకే ఫ్రేమ్ లో తమిళ సూపర్ స్టార్స్