Virat Kohli: విరాట్ కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించిన ఐసీసీ
మెల్‌బోర్న్ టెస్టులో 10వ ఓవర్ ముగిసిన తర్వాత సామ్ కాన్స్టాస్ మరియు విరాట్ కోహ్లీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఓవర్ ముగిసిన తర్వాత కోహ్లి ముందు నుంచి వచ్చి సామ్‌ను భుజంతో నెట్టాడు.
- By Naresh Kumar Published Date - 02:18 PM, Thu - 26 December 24

Virat Kohli: భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆగ్రహానికి గురయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్‌లో నాలుగో టెస్టు జరుగుతోంది. తొలుత ఆస్ట్రేలియా బ్యాటింగ్ కు దిగింది. ఈ బాక్సింగ్ డే టెస్టులో అరంగేట్రం ఆటగాడు 19 ఏళ్ళ సామ్ కాన్స్టాస్ తన అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. టీమిండియా బౌలింగ్ దళాన్ని ధీటుగా ఎదుర్కొని అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అయితే ఈ ఫిఫ్టీకి ముందు మైదానం మధ్యలో కాన్స్టాస్, కోహ్లీ మధ్య వాగ్వాదం జరిగింది. కోహ్లీ తన భుజంతో సామ్ కాన్స్టాస్‌ను నెట్టడం కనిపించింది, దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇప్పుడు ఈ ఘటన తర్వాత కోహ్లీకి ఐసీసీ జరిమానా విధిస్తుందన్న వార్తలు వైరల్ అయ్యాయి. అయితే అనుకున్నట్లుగానే కోహ్లీ ఐసీసీ బిగ్ షాక్ ఇచ్చింది.
మెల్‌బోర్న్ టెస్టులో 10వ ఓవర్ ముగిసిన తర్వాత సామ్ కాన్స్టాస్ మరియు విరాట్ కోహ్లీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఓవర్ ముగిసిన తర్వాత కోహ్లి ముందు నుంచి వచ్చి సామ్‌ను భుజంతో నెట్టాడు. అనంతరం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తాను ఉద్దేశపూర్వకంగా ఇలా చేయలేదని కోహ్లీ స్పష్టం చేశాడు. ఇప్పుడు ఈ వ్యవహారంపై ఐసీసీ సీరియస్ అయింది. ఐసీసీ నిబంధనల ప్రకారం క్రికెట్‌లో ఒక ఆటగాడిని శారీరకంగా స్లెడ్జింగ్ చేయడం నిషేధం. ఇలాంటి ఘటనలో ఆటగాడు లెవెల్ 2 కింద దోషిగా పరిగణించబడతాడు. దీంతో కోహ్లీని దోషిగా తేల్చిన ఐసీసీ మ్యాచ్ ఫీజులో భారీ కోత విధించింది. సమాచారం ప్రకారం కోహ్లీకి 20 శాతం జరిమానా విధించినట్లు తెలుస్తుంది.
Also Read: India vs Australia: తొలిరోజు ముగిసిన ఆట.. ఆసీస్ స్కోర్ ఎంతంటే?
తొలి టెస్టులో భారీ విజయం అందుకున్న భారత్ రెండో టెస్టులో ఓడిపోయింది. అయితే కీలకంగా మారిన మూడో టెస్ట్ వర్షం కారణంగా రద్దయింది. ఈ పరిస్థితుల్లో నాలుగో టెస్టులో గెలిచిన జట్టు సిరీస్ లో ఆధిక్యం ప్రదర్శిస్తుంది. ఈ నేపథ్యంలో మెల్‌బోర్న్ రసవత్తరంగా సాగుతుంది. తొలి రోజు ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది.