Sorry Rishabh:షబ్ పంత్ ఐయామ్ సారీ.. ఊర్వశి రౌతేలా క్షమాపణల వీడియో వైరల్!!
భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ , బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా మధ్య నడుస్తున్న మాటల యుద్ధానికి తెరపడే సమయం ఆసన్నమైందా ?
- By Hashtag U Published Date - 05:41 PM, Tue - 13 September 22

భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ , బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా మధ్య నడుస్తున్న మాటల యుద్ధానికి తెరపడే సమయం ఆసన్నమైందా ? ” ఔను” అని పరిశీలకులు బదులిస్తున్నారు. తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఊర్వశి రౌతేలా చేసిన కామెంట్స్ అందుకు నిదర్శనమని అంటున్నారు. ఇటీవల ఇంటర్వ్యూ సందర్భంగా రిపోర్టర్ ఆమెను ప్రశ్నిస్తూ..
“మీరు రిషబ్ పంత్ కు ఏదైనా సందేశాన్ని పంపాలని అనుకుంటున్నారా?” అని అడిగాడు. “ముక్కు సూటి మాట. నేను వదరుబోతు లా అవాకులు చవాకులు పేల్చదల్చ లేదు. అందుకే ఏది పడితే అది మాట్లాడటం లేదు” అని ఊర్వశి రౌతేలా బదులిచ్చింది. “Forgive and forget అని మీరే అన్నారు కదా. మీరు ఏదైనా సందేశాన్ని పంత్ దాకా చేరవేయాలని భావిస్తున్నారా?” అని మరోసారి రిపోర్టర్ ఆమెను ప్రశ్నించాడు. ఈసారి ఊర్వశి రౌతేలా స్పందిస్తూ .. “నేను ఏమి కూడా చెప్పదల్చుకోలేదు. రిషబ్ పంత్ ను రెండు చేతులు జోడించి క్షమాపణలు కోరుతున్నాను. sorry.. iam sorry” అని చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. వివిధ రకాల కామెంట్స్ పెడుతున్నారు.”ఊర్వశి రౌతేలా దారికి వచ్చేసింది” ఒకరు కామెంట్ పెట్టగా..”అంతా గోల్ మాల్ గా అనిపిస్తోంది” అని మరొకరు కామెంట్ చేశారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో ఊర్వశి రౌతేలా చేసిన సంచలన కామెంట్స్ వల్ల ఇద్దరి మధ్య కోల్డ్ వార్ మొదలైంది.
“ఒక వ్యక్తి నా కోసం హోటల్ లాబీలో దాదాపు 10 గంటలు వెయిట్ చేశాడు. పంత్ పేరు చెప్పకుండానే..‘ఆర్పీ’ తనను కలవాలనే ఆశతో ఒకసారి 16 సార్లు మిస్డ్ కాల్ ఇచ్చాడు” అని రిషబ్ పంత్ ను ఉద్దేశించి ఆ ఇంటర్వ్యూలో ఊర్వశి మాట్లాడింది. అప్పట్లో దీనికి స్పందించిన రిషబ్ తన ఇన్స్టా గ్రామ్ అకౌంట్లో ఒక స్టోరీ పెట్టాడు. “ఓ సోదరి నన్ను వెంటాడటం ఆపేయ్” అని ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే ఈ స్టోరీని పోస్ట్ చేసిన కొంతసేపటి తర్వాత దాన్ని రిషబ్ డిలీట్ కూడా చేశాడు. అయితే దీనికి కూడా ఊర్వశి రిప్లయ్ ఇచ్చింది. “చోటు భయ్యా” అంటూ రిషబ్ కు సమాధానం ఇచ్చి అగ్గి రాజేసింది. ఎట్టకేలకు మళ్ళీ ఒక ఇంటర్వ్యూ ద్వారా రిషబ్ కు క్షమాపణలు చెప్పేసి.. ఈ మాటల యుద్ధానికి ఊర్వశి తెర దించింది.
డేటింగ్..
మీడియా నివేదికల ప్రకారం, ఊర్వశి రౌతేలా , రిషబ్ పంత్ ఒక సమయంలో డేటింగ్ ప్రారంభించారు. కానీ ఎవరితోనూ వారి సంబంధం గురించి ఏమీ చెప్పలేదు. ఈ సంఘటన 2018లో జరిగింది. ఇక అదే సంవత్సరంలో తమ లవ్ కు బ్రేకప్ చెప్పుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు.
ఊర్వశి రౌతేలా భారత క్రికెటర్ తో తన సంబంధాన్ని అధికారికంగా చేసుకోవాలనుకుంది. అయితే తమ రిలేషన్ షిప్ గురించి ఎవరికీ తెలియకూడదని పంత్ కండీషన్ పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. వాట్సాప్‌లో నటి నంబర్‌ను పంత్ బ్లాక్ చేశాడు.ఊర్వశి రౌతేలా మేనేజర్ మాట్లాడుతూ.. ఈ వ్యవహారాన్ని ముగించడానికి వారిద్దరూ పరస్పరం అంగీకరించారని, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేయడంతో ఊర్వశి కూడా పంత్ నంబర్‌ను బ్లాక్ చేసిందని తెలిపాడు. ఇక ఊర్వశితో విడిపోయినట్లు ఆరోపణలు వచ్చిన వెంటనే రిషబ్ ఇషాతో డేటింగ్ ప్రారంభించాడు. ఈ జంట జనవరి 2021లో దానిని ప్రపంచానికి వెల్లడించారు.
Tags
- bollywood
- indian cricket player
- rishabh controversy
- Rishabh Pant
- uravashi says sorry
- urvashi rautela

Related News

Waheeda: వహీదా.. తుఝే సలామ్..!
ఆజ్ ఫిర్ జీనేకీ తమన్నా హై.. ఆజ్ ఫిర్ మర్నేకా ఇరాదా హై..ఈ పాట గుర్తుందా..? గుర్తు లేకుండా ఎలా ఉంటుంది? వహీదా రెహ్మాన్ (Waheeda) గుర్తుంటే ఈ పాట గుర్తుంటుంది.