HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Uppal Test Tickets On Sale From 18th

HCA : ఈ నెల 18 నుంచి ఉప్ప‌ల్ టెస్టు టిక్కెట్లు అమ్మ‌కం

ఈనెల 25 నుంచి ఉప్ప‌ల్ స్టేడియంలో మొద‌ల‌వ‌నున్న భార‌త్‌-ఇంగ్లండ్ తొలి టెస్టు మ్యాచ్ టిక్కెట్ల అమ్మ‌కాలు వ‌చ్చే 18వ తేదీ

  • Author : Prasad Date : 16-01-2024 - 7:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
HCA President
HCA President

ఈనెల 25 నుంచి ఉప్ప‌ల్ స్టేడియంలో మొద‌ల‌వ‌నున్న భార‌త్‌-ఇంగ్లండ్ తొలి టెస్టు మ్యాచ్ టిక్కెట్ల అమ్మ‌కాలు వ‌చ్చే 18వ తేదీ (గురువారం) నుంచి ప్రారంభిస్తున్న‌ట్టు హైద‌రాబాద్‌ క్రికెట్ అసోసియేష‌న్ అధ్యక్షుడు అర్శ‌న‌ప‌ల్లి జ‌గ‌న్‌మోహ‌న్ రావు వెల్ల‌డించారు. టిక్కెట్ల అమ్మ‌కాలపై హెచ్‌సీఏ కార్య‌వ‌ర్గ స‌భ్యుల‌తో స‌మీక్ష నిర్వ‌హించిన అనంత‌రం ఆయ‌న వివ‌రాలు తెలియ‌జేశారు. 18వ తేదీ సాయంత్రం 7 గంట‌ల నుంచి పేటీఎం ఇన్‌సైడ‌ర్ మొబైల్ యాప్‌లో, అలానే www.insider.in వెబ్‌సైట్‌లో టిక్కెట్ల‌ను ఆన్‌లైన్‌లో విక్ర‌యించ‌నున్నామ‌న్నారు. మిగిల‌న టిక్కెట్ల‌ను 22వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో పాటు జింఖానాలోని హెచ్‌సీఏ స్టేడియంలో ఆఫ్‌లైన్‌లో కూడా అమ్మ‌నున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు 22వ తేదీ నుంచి ఏదైనా త‌మ ప్ర‌భుత్వ గుర్తింపు కార్డు చూపించి, టిక్కెట్లను రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంద‌ని తెలిపారు.

తెలంగాణ కేంద్రంగా దేశం కోసం అహ‌ర్నిశ‌లు త‌మ ర‌క్తం ధార‌బోస్తున్న భార‌త సాయుధ ద‌ళాల సిబ్బందిని రిప‌బ్లిక్ డే రోజున (26వ తేదీ) మ్యాచ్ చూసేందుకు ఉచితంగా అనుమ‌తించ‌నున్నామ‌ని చెప్పారు. తెలంగాణ‌లో ప‌ని చేస్తున్న భార‌త సాయుధ బ‌ల‌గాల (ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌) సిబ్బందికి వారి కుటుంబాల‌తో క‌లిసి ఉచితంగా మ్యాచ్ చూసేందుకు అవ‌కాశం క‌ల్పిస్తున్నామ‌ని చెప్పారు. ఆస‌క్తి గ‌ల వారు త‌మ‌ విభాగాధిప‌తితో సంత‌కం చేయించిన లేఖ‌, కుటుంబ స‌భ్యుల వివ‌రాల‌ను ఈనెల 18వ తేదీ లోపు హెచ్‌సీఏ సీఈఓకి ఈ-మెయిల్ చేయాల‌ని సూచించారు.

స్కూల్ విద్యార్థుల‌కు రోజుకు ఐదు వేలు చొప్ప‌న‌, మొత్తం 5 రోజుల‌కు గానూ 25 వేల కాంప్లిమెంట‌రీ పాసులు కేటాయించామ‌న్నారు. ఈ 25 వేల మందికి ఉచితంగా భోజ‌నం, తాగునీరు అందించ‌నున్నామ‌ని తెలిపారు. విద్యార్థుల‌ను ఉచితంగా అనుమ‌తిస్తామ‌ని ప్ర‌క‌టించ‌న‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు తెలంగాణ వ్యాప్తంగా సుమారు 300ల‌కు పైగా పాఠ‌శాల‌ల నుంచి అర్జీలు వ‌చ్చాయ‌ని, వారితో త‌మ సిబ్బంది ప్ర‌త్యుత్త‌రాలు న‌డుపుతున్నార‌ని జ‌గ‌న్‌మోహ‌న్ రావు చెప్పారు. స్కూల్స్ త‌మ విద్యార్థుల పేరు, క్లాస్ స‌హా పూర్తి వివ‌రాల‌ను పంపించాల‌న్నారు. విద్యార్థులు త‌ప్ప‌నిస‌రిగా స్కూల్ యూనిఫామ్స్‌లో ఐడీ కార్డ్స్ వెంట తీసుకొని రావాల‌ని, స్టేడియంలోకి ప్ర‌వేశించాక విద్యార్థుల బాధ్య‌త‌ సంబంధిత పాఠ‌శాల సిబ్బందిదేన‌ని చెప్పారు. టెస్టు మ్యాచ్ టిక్కెట్ ప్రారంభ ధ‌ర క‌నిష్ఠంగా రూ.200 కాగా, గ‌రిష్ఠంగా రూ.4 వేలుగా నిర్ణ‌యించామ‌ని జ‌గ‌న్‌మోహ‌న్ రావు చెప్పారు. సామాన్యుల‌ను దృష్టిలో పెట్టుకుని, అంద‌రికి అందుబాటులో ఉండేలాగా ధ‌ర‌ల‌ను నిర్ణ‌యించామ‌న్నారు.

టిక్కెట్ల ధ‌ర‌ల వివ‌రాలు:
రోజు వారి రేట్లు, ఐదు రోజుల సీజ‌న్ టిక్కెట్ ధ‌ర‌లు వేర్వేరుగా ఉన్నాయి, గ‌మ‌నించ‌గ‌ల‌రు

1. North Pavilion (Terrace) Rs.200/- Rs.600/-
2. South Pavilion (Terrace) Rs.200/- Rs.600/-
3. East Pavilion (First Floor) Rs.499/- (No 5 days ticket)
4. East Pavilion (Ground Floor) Rs.750/- (No 5 days ticket)
5. South Pavilion (Ground Floor) Rs.1,250/- Rs.3,750/-
6. South Pavilion (First Floor) Rs.1,250/- Rs.3,750/-
7. West Pavilion (First Floor) NA Rs.1,500/- (Allowed 5 days)
8. West Pavilion (Ground Floor) NA Rs.2,250/- (Allowed 5 days)
9. North Pavilion (Ground Floor) NA Rs.3,750/- (Allowed 5 days)
10.North Pavilion (First Floor) NA Rs.3,750/- (Allowed 5 days)
11.North Pavilion Corporate Box (Hospitality) Rs. 3,000/- Rs. 12,000/-
12.South Pavilion Corporate Box (Hospitality) Rs. 4,000/- Rs. 16,000/-


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • HCA
  • HCA President jagan mohan rao
  • hyderabad
  • Hyderabad Cricket Association
  • sports
  • telangana
  • Uppal stadium

Related News

Nepali Gang Loots Gold In Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్‌

హైదరాబాద్ నగరంలో నేపాలీ ముఠా మరో భారీ దోపిడీకి పాల్పడింది. గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాలో నివసిస్తున్న ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో సుమారు ఒక కిలో బంగారు ఆభరణాలు, విలువైన వజ్రాలను ఈ ముఠా దోచుకుంది. ఇంట్లో పనిమనుషులుగా చేరిన నేపాల్‌కు చెందిన దంపతులే ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యజమాని కుటుంబం ముంబై వెళ్లిన సమయంలో వీరు ఈ ఘాతుకానికి ఒడి

  • Heavy Rain Forecast for Telangana

    తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు

  • KTR Delivers Strong Counter to Pawan's Remarks

    KTR: పవన్‌ వ్యాఖ్యలపై కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

  • Janasena Pawan Kalyan

    JANASENA : ప‌వ‌న్ పై జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఫైర్‌.. ప్యాకేజీ ఇస్తే..?

  • Janasena will contest in Telangana.

    Pawan Kalyan: తెలంగాణలో పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్

Latest News

  • Visakhapatnam Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్

  • Peddi Collections: రూ.300 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్ ‘పెద్ది’

  • Crime News Hyderabad: పెన్షన్ డబ్బు కోసం కన్నతండ్రిని చంపిన కొడుకు, కూతురు కు ఉరి శిక్ష, తల్లికి జీవిత ఖైదు

  • Physical Relation: ఐదు గంటల పాటు నిర్విరామంగా సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఏం జరిగిందంటే?

  • Nadendla Manohar: రేషన్ దుకాణాల్లో త్వరలో స్టీమ్‌ రైస్‌: మంత్రి నాదెండ్ల మనోహర్

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd