Virat Kohli:ఫాన్స్ పై కోహ్లీ సీరియస్…ఎందుకంటే ?
భారత్ లో క్రికెట్ మతం అయితే క్రికెటర్లు దేవుళ్ళు గా చూస్తారు ..అభిమానులు వారిని అంతలా ఆరాధిస్తారు. ఫొటోల కోసం, ఆటోగ్రాఫ్ కోసం ఎగబడుతారు.
- By Naresh Kumar Published Date - 05:38 PM, Fri - 21 October 22

భారత్ లో క్రికెట్ మతం అయితే క్రికెటర్లు దేవుళ్ళు గా చూస్తారు ..అభిమానులు వారిని అంతలా ఆరాధిస్తారు. ఫొటోల కోసం, ఆటోగ్రాఫ్ కోసం ఎగబడుతారు. అయితే ఒక్కోసారి వాళ్లే క్రికెటర్ల ఆగ్రహానికి కారణమవుతారు. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి కొందరు ఫ్యాన్స్‌కు కోపం తెప్పించారు. ఆదివారం పాకిస్థాన్‌తో జరగబోయే తొలి మ్యాచ్ కోసం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేస్తోంది.
మిగతా ప్లేయర్స్‌తోపాటు విరాట్ కోహ్లి కూడా నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ సమయంలో నెట్స్ వెనుక నుంచి కొందరు అభిమానులు ఫోన్‌లో వీడియో తీస్తున్నారు. కొడితే గ్రౌండ్ బయట పడాలి అని వాళ్లు గట్టిగా అరవడం ఈ వీడియోలో వినిపిస్తుంది. వాళ్ల అరుపులను సాధారణంగా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ స్టంప్స్ వెనుకాలే ఇలా అరుస్తుండటంతో విరాట్ కోహ్లి ఏకాగ్రత దెబ్బతింది. దీంతో వెంటనే పక్కకు వచ్చి.. ప్రాక్టీస్ సమయంలో అలా అరవద్దని ఆ అభిమానులకు వార్నింగ్ ఇచ్చాడు. మీరు ఇలా అరుస్తుంటే ఏకాగ్రత దెబ్బతింటుందని కోహ్లి చెప్పడం ఈ వీడియోలో చూడొచ్చు. దీంతో ఆ అభిమానులు ఇక నుంచి నువ్వు రిలాక్స్ అయిన సమయంలో అరుస్తామని చెప్పారు. అయితే కొందరు మాత్రం కింగ్ ఒక్కరే కదా ఉండేది అని కూడా వీడియోలో వినిపించింది. భారత్ , పాకిస్థాన్ మధ్య సూపర్ 12 మ్యాచ్ ఆదివారం మెల్ బోర్న్ స్టేడియం వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా నిలిచే అవకాశం ఉంది.
Let's go ⏳🇮🇳 pic.twitter.com/2a7hSuqyi6
— Virat Kohli (@imVkohli) October 18, 2022