Lara on Umran:ఉమ్రాన్ మాలిక్ అతన్ని గుర్తుకు తెస్తున్నాడు-లారా
ఐపీఎల్ 15వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస విజయాలతో దుమ్మురేపుతోంది.
- By Naresh Kumar Published Date - 11:10 PM, Sun - 24 April 22
ఐపీఎల్ 15వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస విజయాలతో దుమ్మురేపుతోంది. టోర్నీ ఆరంభానికి ముందు పెద్దగా అంచనాలు లేని హైదరాబాద్ తొలి రెండు మ్యాచ్ లు ఓడిన తర్వాత వరుసగా ఐదు మ్యాచ్ లు గెలిచి పాయింట్ల పట్టికలో దూసుకెళుతోంది. బౌలర్లు సమిష్టిగా రాణిస్తుండడం, కెప్టెన్ విలియమ్సన్ వ్యూహాలు కలిసి సన్ రైజర్స్ కు విజయాలనందిస్తున్నాయి. బౌలింగ్ లో ముఖ్యంగా యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ అదరగొడుతున్నాడు. దాదాపు ప్రతీ మ్యాచ్ లోనూ 150 కిలోమీటర్ల పైగా వేగంతో బంతులు సంధిస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను కంగారెత్తిస్తున్నాడు. తాజా, మాజీ ఆటగాళ్ళు సైతం ఉమ్రాన్ వేగానికి ఫిదా అయ్యారు. తాజాగా విండీస్ దిగ్గజం బ్రయాన్ లారా ఉమ్రాన్ మాలిక్ పై ప్రశంసలు కురిపించాడు.
సన్ రైజర్స్ సపోర్టింగ్ స్టాఫ్ లో ఒకరిగా ఉన్న లారా ఉమ్రాన్ పేస్ బౌలింగ్ చాలా బాగుందని కితాబిచ్చాడు. తనకు ఫిడెల్ ఎడ్వర్డ్స్ బౌలింగ్ ను ఉమ్రాన్ గుర్తుకు తెస్తున్నాడని ప్రశంసించాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్ లో రాణించేందుకు కేవలం పేస్ మాత్రమే సరిపోదని, కాస్త వేరియేషన్ కూడా కావాలన్నాడు. ఉమ్రాన్ మాలిక్ ప్రస్తుతం ఇది నేర్చుకుంటున్నాడని , ఖచ్చితంగా జాతీయ జట్టులో చోటు సంపాదిస్తాడని వ్యాఖ్యానించాడు. ఉమ్రాన్ మాలిక్ 7 మ్యాచ్ లలో 10 వికెట్లు పడగొట్టాడు. కోల్ కతాపై చివరి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. వచ్చే సౌతాఫ్రికాతో సిరీస్ కు ఉమ్రాన్ మాలిక్ ఎంపికయ్యే అవకాశముందని తెలుస్తోంది.
Related News
RCB vs SRH: సన్ రైజర్స్ బ్యాటర్ల విధ్వంసం… బెంగుళూరుపై ఘన విజయం
ఐపీఎల్ 17వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. తన జోరును కొనసాగిస్తూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును వారి సొంత గడ్డపై ఓడించింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 25 రన్స్ తేడాతో విజయం సాధించింది.