Team India: ఫైనల్ పోరులో టీమిండియా ఓడిపోవడానికి ప్రధాన కారణాలివే!
- By Balu J Published Date - 01:03 PM, Mon - 20 November 23

Team India: ఆదివారం ఇక్కడ నరేంద్ర మోదీ స్టేడియంలో స్వదేశంలో వన్డే ప్రపంచకప్ టైటిల్ ను గెలుచుకోవడంలో టీమిండియా ఘోరంగా విఫలమైంది. ట్రావిస్ హెడ్ (137) అద్భుత బ్యాటింగ్‌తో ఆతిథ్య భారత్‌ను ఓడించి ఆస్ట్రేలియా ఆరోసారి వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను అందుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ లేదా ఫీల్డింగ్ ఏదైనా, ఆస్ట్రేలియా పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది.
టీమ్ ఇండియా గేమ్‌లో క్లూలెస్‌గా కనిపించింది. ఓటమికి కారణాలు ఏ ఒక్క ఆటగాడి అని స్పష్టంగా చెప్పలే. కానీ జట్టు ప్రదర్శనగా మాత్రం విఫలమైంది. భారత్ టాస్ గెలిచినా ముందుగా బ్యాటింగ్ చేస్తానని రోహిత్ శర్మ అన్నాడు. ఆస్ట్రేలియన్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆ తర్వాత మెరుపు బౌలింగ్ తో టీమిండియాను కట్టడి చేశాడు. అలాగే, భారత్ మూడు వికెట్లు కోల్పోయినప్పుడు, విరాట్ కోహ్లి మరియు కెఎల్ రాహుల్ చాలా నెమ్మదిగా ఆడారు. వీరిద్దరూ 18 ఓవర్లలో కేవలం 67 పరుగులు జోడించారు. డిఫెన్సివ్ విధానంతో పాటు ఫీల్డ్‌లో ఆస్ట్రేలియా మెరుపులు మెరిపించడంతో ఆతిథ్య జట్టు 40-50 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
కోహ్లి, రాహుల్ ఇద్దరూ తమ అర్ధశతకాలను చేరుకున్నప్పటికీ, ఆరంభాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైంది. రాహుల్ ఇన్నింగ్స్ 107 బంతుల్లో 66 పరుగులు చేయడం కూడా ఒకవిధంగా నష్టమే అని చెప్పాలి. రవీంద్ర జడేజా తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ విఫలమయ్యాడు. ఆ జట్టు మొత్తం 240 పరుగులు మాత్రమే చేయగలిగింది. బౌలింగ్ విభాగంలో మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా భారత్‌కు మంచి ఆరంభాన్ని అందించారు. కానీ చివరల్లో రాణించలేకపోయారు. ఇక ఆస్ట్రేలియా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో సత్తా చాటి కప్పును కొట్టింది.
Related News

India Head Coach: భారత జట్టుకు కొత్త కోచ్.. భారతీయుడు కాదు విదేశీ ఆటగాడు..?!
భారత కొత్త ప్రధాన కోచ్ (India Head Coach) పదవి ఈరోజుల్లో వార్తల్లో నిలుస్తుంది. ప్రపంచకప్‌తో భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది.