Australia Cricketer: మృత్యువుతో పోరాడుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్!
ఈ ప్రమాదాన్ని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఫిల్ హ్యూస్‌తో జరిగిన భయంకరమైన ప్రమాదంతో పోలుస్తున్నారు. ఫిల్ హ్యూస్‌కు కూడా మెడపై గాయం కావడంతో అతను దురదృష్టవశాత్తు మరణించాడు.
- By Gopichand Published Date - 06:35 PM, Wed - 29 October 25
Australia Cricketer: భారత జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. అక్కడ ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతోంది. మరోవైపు భారత వన్డే జట్టు ఉప-కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం సిడ్నీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భారత్-ఆస్ట్రేలియా మూడో వన్డేలో అయ్యర్ తీవ్రంగా గాయపడ్డారు. అతని ఎడమ పక్కటెముకలకు తీవ్ర గాయం కావడంతో అతన్ని ఐసీయూ (ICU)లో కూడా చేర్చారు.
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా నుంచి ఒక తీవ్రమైన దుర్వార్త వెలువడింది. నివేదికల ప్రకారం.. మెల్‌బోర్న్‌కు చెందిన 17 ఏళ్ల స్థానిక యువ క్రికెటర్‌కు (Australia Cricketer) మెడపై తీవ్ర గాయం కావడంతో అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువకుడు లైఫ్ సపోర్ట్‌పై మృత్యువుతో పోరాడుతున్నాడు.
Also Read: India vs Australia: వర్షం ఎఫెక్ట్.. భారత్- ఆస్ట్రేలియా తొలి టీ20 రద్దు!
A young cricketer is in the fight of his life after a horror incident at a match in Melbourne’s east. A ball hit the teenager in the neck, causing critical injuries. @ainsleykoch has the latest from Ferntree Gully. https://t.co/5zYfOfGqUb #7NEWS pic.twitter.com/8qCSsv4XiJ
— 7NEWS Melbourne (@7NewsMelbourne) October 29, 2025
ఆస్ట్రేలియాలో లైఫ్ సపోర్ట్‌పై క్రికెటర్
ఆస్ట్రేలియా స్థానిక మీడియా నివేదిక ప్రకారం.. ఈ ప్రమాదం మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఫర్న్‌ట్రీ గల్లీలోని వ్యాలీ ట్యూ రిజర్వ్‌లో జరిగింది. 17 ఏళ్ల ఈ యువ ఆటగాడికి ప్రాక్టీస్ సమయంలో బంతి మెడపై బలంగా తగిలింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అక్కడివారు వెంటనే అతన్ని సమీపంలోని మోనాష్ మెడికల్ సెంటర్‌కు తరలించారు. అక్కడ డాక్టర్లు అతన్ని లైఫ్ సపోర్ట్‌పై ఉంచారు. ప్రస్తుతం ఆ ఆటగాడు ప్రాణాపాయ స్థితిలో పోరాడుతున్నాడు. అందరూ అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. క్రికెట్ విక్టోరియా, క్రికెట్ ఆస్ట్రేలియా ఆ ఆటగాడితో సంబంధం ఉన్న రెండు క్లబ్‌లు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. అవసరమైన అన్ని సౌకర్యాలను అందిస్తున్నాయి.
ఫిల్ హ్యూస్ ప్రమాదంతో పోలిక
ఈ ప్రమాదాన్ని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఫిల్ హ్యూస్‌తో జరిగిన భయంకరమైన ప్రమాదంతో పోలుస్తున్నారు. ఫిల్ హ్యూస్‌కు కూడా మెడపై గాయం కావడంతో అతను దురదృష్టవశాత్తు మరణించాడు. 2014లో సిడ్నీలో జరిగిన షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో షాన్ అబాట్ వేసిన బౌన్సర్ ఫిల్ హ్యూస్ మెడకు తగిలింది. వెంటనే అతను మైదానంలోనే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత అతను కోలుకోలేకపోయాడు. ఈ సంఘటన క్రికెట్ చరిత్రలో అత్యంత బాధాకరమైన రోజుగా పరిగణించబడుతుంది.