Team India: కోచ్ మోర్కెల్‌తో పేసర్ల ఫన్నీ ‘ఫైట్’ – గంభీర్ నేతృత్వంలో ప్రాక్టీస్ సెషన్‌లో నవ్వులు
ఈ రియల్ ఫైట్ కాదు, కోచ్ మోర్కెల్ వారి బౌలింగ్ ప్రాక్టీస్‌లో వారితో రెజ్లింగ్ చేస్తూ ఆటపట్టించటం మాత్రమే. గంభీర్ నేతృత్వంలోని ప్రాక్టీస్ సెషన్‌లో ఈ ఫన్నీ సన్నివేశం సౌహార్దాన్ని చూపిస్తూ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
- By Hashtag U Published Date - 11:37 PM, Sat - 28 June 25

Team India: టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, ఆకాశ్‌దీప్ మధ్య ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌కి ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో ఫన్నీ “రెజ్లింగ్ ఫైట్” వైరల్‌గా మారింది.
మొదట మోర్కెల్ అర్ష్‌దీప్‌ను చురకగా రెచ్చగొట్టి, కాళ్లతో బంధించి ఉక్కిరిబిక్కిరి చేశాడు. అప్పుడు అర్ష్‌దీప్, ఆకాశ్‌దీప్ కలిసి కోచ్‌ను కింద పడేశారు. కానీ మోర్కెల్ మళ్లీ శక్తితో లేచి అర్ష్‌దీప్‌పై దూకి చేతులు పైకి అదిమిపెట్టాడు. కొంతసేపు కోచ్, పేసర్లు ఇలానే చక్కిలిగింతలు పెట్టుకుంటూ సరదాగా ఫైట్ చేసుకున్నారు.
ఈ రియల్ ఫైట్ కాదు, కోచ్ మోర్కెల్ వారి బౌలింగ్ ప్రాక్టీస్‌లో వారితో రెజ్లింగ్ చేస్తూ ఆటపట్టించటం మాత్రమే. గంభీర్ నేతృత్వంలోని ప్రాక్టీస్ సెషన్‌లో ఈ ఫన్నీ సన్నివేశం సౌహార్దాన్ని చూపిస్తూ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
A fun WWE fight by Morkel & Arshdeep 😂🔥 [Ankan Kar] pic.twitter.com/bYmDPXUR3w
— Johns. (@CricCrazyJohns) June 28, 2025
రెండో టెస్టులో జస్‌ప్రీత్ బుమ్రాకు రిలాక్స్ ఇచ్చి, అర్ష్‌దీప్‌ను దింపడం, అలాగే ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో ఆకాశ్‌దీప్‌ను ఆడించేందుకు కోచ్, గంభీర్-గిల్ బృందం చర్చిస్తున్నట్లు సమాచారం. లెఫ్టార్మ్ పేసర్‌గా అర్ష్‌దీప్ బౌలింగ్ వైవిధ్యాన్ని ఇస్తూ, స్వింగ్ డెలివరీలతో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందులు పెట్టేందుకు ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.