రెండో వన్డేకి భారత్ తుది జట్టు ఇదే
బోలాండ్ పార్క్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 31 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో భారత మిడిలార్డర్‌తో పాటు, బౌలర్లు కూడా విఫలమయ్యారు.
- By Hashtag U Published Date - 10:56 AM, Fri - 21 January 22

బోలాండ్ పార్క్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 31 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో భారత మిడిలార్డర్‌తో పాటు, బౌలర్లు కూడా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో బోలాండ్ పార్క్ వేదికగానే శుక్రవారం జరగనున్న రెండో వన్డేలో ఎలాగైనా విజయం సారించాలని టీమిండియా భావిస్తుంది.. ఈ క్రమంలోనే తుది జట్టు కూర్పుపై ప్రత్యేకంగా దృష్టి సారించింది..ఈ మ్యాచ్ లో టీమిండియా ఇన్నింగ్స్ ను రుతురాజ్ గైక్వాడ్, శిఖర్ ధావన్ ఆరంభించనున్నారు… అలాగే మూడో స్థానంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కు రానుండగా.. నాలుగో స్థానంలో శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ కు రానున్నాడు.. ఇక కెప్టెన్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా కాకుండా ఐదో స్థానంలో బ్యాటింగ్ కు రానుండగా.., యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆరో స్థానంలో బ్యాటింగ్ కు రానున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో పేస్ ఆల్ రౌండర్ గా శార్దూల్ ఠాకూర్ బరిలోకి దిగనుండగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్ బరిలోకి దిగనున్నారు… ఇక ఈ మ్యాచ్ లో భారత పేస్ బౌలింగ్ బాధ్యతల్ని సీనియర్ ఆటగాళ్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా మోయనున్నారు…
అంతకుముందు దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన తొలి వన్డేలో ఆల్‌రౌండర్‌గా జట్టులోకి తీసుకున్న వెంకటేశ్ అయ్యర్‌తో కెప్టెన్ కేఎల్ రాహుల్ కనీసం ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయించలేదు. దీనికి సంబందించి రాహుల్ కెప్టెన్సీ పై విమర్శలు కూడా వచ్చాయి. అయితే వెంకటేష్ అయ్యర్ బ్యాటింగ్ లో కూడా తెలిపోయాడు.. ఈ క్రమంలోనే అతని స్థానంలో రుతు రాజ్ గైక్వాడ్ ను జట్టులోకి తీసుకొని ఓపెనర్ గా పంపించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మ్యాచ్ లో గెలిస్తేనే భారత్ సీరీస్ ఆశలు నిలిచి ఉంటాయి.