Team India Time Off: బ్రేక్‌ను ఆస్వాదిస్తున్న భారత క్రికెటర్లు
ఆసియాకప్‌లో దుమ్మురేపుతున్న భారత్ ఇప్పటికే సూపర్ 4 స్టేజ్‌కు చేరుకుంది. టీ ట్వంటీ ప్రపంచకప్ ముంగిట కీలక ఆటగాళ్ళు బాగానే కుదురుకున్నారు.
- By Naresh Kumar Published Date - 04:56 PM, Fri - 2 September 22

ఆసియాకప్‌లో దుమ్మురేపుతున్న భారత్ ఇప్పటికే సూపర్ 4 స్టేజ్‌కు చేరుకుంది. టీ ట్వంటీ ప్రపంచకప్ ముంగిట కీలక ఆటగాళ్ళు బాగానే కుదురుకున్నారు. కోహ్లీతో పాటు ఆల్‌రౌండర్లు హార్థిక్ పాండ్యా , జడేజా వంటి ప్లేయర్స్ సత్తా చాటుతున్నారు. సూపర్ 4 స్టేజ్ ప్రారంభమయ్యేందుకు ఇంకా సమయం ఉండడంతో టీమిండియా క్రికెటర్లు దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. బీచ్ అందాలను ఆస్వాదిస్తూ.. సర్ఫింగ్ చేస్తూ, వాలీబాల్ ఆడుతూ సేదతీరుతున్నారు. విరామ సమయాన్ని సరదాగా గడుపుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ అభిమానులతో షేర్ చేసుకుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి సహా మిగిలిన ఆటగాళ్లంతా ఈ బ్రేక్‌ను పూర్తిగా ఆస్వాదిస్తున్నారు. అర్ష్‌దీప్ సింగ్, కేఎల్ రాహుల్ సర్ఫింగ్ చేస్తుండగా.. కోహ్లి.. దినేశ్ కార్తిక్, అశ్విన్, రాహుల్, హార్దిక్ పాండ్యా బీచ్ వాలీబాల్ ఆడుతూ కనిపించారు.
తొలి మ్యాచ్ పాకిస్థాన్ చిత్తు చేసిన భారత్, తర్వాత హాంకాంగ్‌పై గెలిచింది. ఆదివారం జరగనున్న సూపర్ 4 మ్యాచ్‌లో భారత్, తన గ్రూపులో సెకండ్ టాపర్‌తో తలపడనుంది. హాంకాంగ్‌తో మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న పాక్ జట్టునే మళ్ళీ టీమిండియా ఢీకొనబోతోంది. గత మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకున్న హార్థిక్ పాండ్యా మళ్ళీ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనుండగా.. బౌలింగ్‌లో ధారాళంగా పరుగులిస్తున్న అవేశ్‌ఖాన్‌పై వేటు పడే అవకాశముంది.
When #TeamIndia hit 𝗨.𝗡.𝗪.𝗜.𝗡.𝗗! 👏
Time for some surf, sand & beach volley! 😎#AsiaCup2022 pic.twitter.com/cm3znX7Ll4
— BCCI (@BCCI) September 2, 2022