HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Tammy Beaumont 208 Makes History

Tammy Beaumont: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ మహిళ క్రికెటర్ బ్యూమాంట్

ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ మహిళ బ్యాట్స్‌మెన్ టామీ బ్యూమాంట్ (Tammy Beaumont) అద్భుత డబుల్ సెంచరీ సాధించింది.

  • Author : Gopi Date : 25-06-2023 - 6:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tammy Beaumont
Resizeimagesize (1280 X 720) 11zon

Tammy Beaumont: ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ మహిళ బ్యాట్స్‌మెన్ టామీ బ్యూమాంట్ (Tammy Beaumont) అద్భుత డబుల్ సెంచరీ సాధించింది. టామీ బ్యూమాంట్ 331 బంతుల్లో 208 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. ఆమె ఇన్నింగ్స్‌లో 27 ఫోర్లు బాదింది. దీనితో పాటు టామీ బ్యూమాంట్ తన పేరు మీద ఓ రికార్డును కూడా సృష్టించింది. నిజానికి మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో డబుల్ సెంచరీ చేసిన తొలి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌గా టామీ బ్యూమాంట్ నిలిచింది. 1935లో ఇంగ్లండ్ ప్లేయర్ బెట్టీ స్నోబాల్ 189 రన్స్ చేయగా ఇంగ్లండ్ తరపున ఇప్పటివరకు ఇదే అత్యధిక స్కోర్. ఇప్పుడు దాన్ని బ్యూమాంట్ అధిగమించారు.

ఇంగ్లండ్ 463 పరుగులు చేసింది

అదే సమయంలో ఇంగ్లాండ్ తన ఇన్నింగ్స్‌లో 463 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌ ఆధారంగా ఆస్ట్రేలియా 10 పరుగుల ఆధిక్యం సాధించింది. టామీ బ్యూమాంట్‌తో పాటు నైట్ సీవర్ బ్రంట్, హీథర్ నైట్, డేనియల్ వ్యాట్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. నైట్ సీవర్ బ్రంట్, హీథర్ నైట్, డేనియల్ వ్యాట్ వరుసగా 78, 57, 44 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా తరఫున యాష్లే గార్డనర్ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టగా.. తహిలా మెక్‌గ్రాత్ మూడు వికెట్లు పడగొట్టింది. డార్సీ బ్రౌన్, అన్నాబెల్ సదర్లాండ్, ఎల్లీస్ ప్యారీ ఒక్కొక్క వికెట్ తీశారు.

Also Read: ICC Cricket World Cup Qualifier 2023: విండీస్‌కు జింబాబ్వే షాక్‌

అంతకుముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలీ బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు 473 పరుగులకు కుప్పకూలింది. ఆస్ట్రేలియా తరఫున అనాబెల్ సదర్లాండ్ అద్భుత సెంచరీ చేసింది. అన్నాబెల్ సదర్లాండ్ 184 బంతుల్లో 137 పరుగులు చేసింది. ఆమె ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. ఇంగ్లండ్ తరఫున సోఫీ అస్క్లెటన్ అత్యధికంగా 5 వికెట్లు పడగొట్టింది. లారెన్ బెల్, లారెన్ ఫిల్లర్ రెండేసి వికెట్లు తీశారు. రెండు జట్ల మధ్య ఈ యాషెస్ 2023 మ్యాచ్ ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరగడం గమనార్హం. యాషెస్ 2023లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య కేవలం 1 టెస్ట్ మ్యాచ్ మాత్రమే జరుగుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • australia
  • england
  • Tammy Beaumont
  • Womens Ashes

Related News

Why are plumbers respected more than engineers in the country? An Indian in Australia can earn ₹67 lakh per year.

Viral Video: స్వదేశంలో ఇంజనీర్ల కంటే ప్లంబర్లకు ఎందుకు ఎక్కువ గౌరవం? ఆస్ట్రేలియాలోని ఒక భారతీయుడు ఏడాదికి రూ. 67 లక్షలు సంపాదించగలరు.

ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ఒక భారతీయ వ్యక్తి, భారతదేశంతో పోలిస్తే ఆస్ట్రేలియాలో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, వడ్రంగుల వంటి వృత్తి కార్మికులు అధిక జీతాలు మరియు గొప్ప సామాజిక గౌరవాన్ని పొందుతున్నారని చెప్పడంతో ఆయన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ఒక భారతీయ వ్యక్తి, ఆ దేశంలో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, వడ్రంగుల వంటి వృత్తి కార్మికులకు లభించే విలువ

    Latest News

    • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

    • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

    • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

    • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

    • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd