She Is Male : ‘‘నువ్వు మహిళవేనా ? పురుషుడివా ?’’.. ఈ ప్రశ్నపై మహిళా బాక్సర్ సంచలన నిర్ణయం
దీంతో లిన్ యూ(She Is Male) తీవ్ర అసహనానికి గురైంది. అలాంటి వాళ్లకు సమాధానం చెప్పడం ఇష్టం లేక పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించింది.
- By Pasha Published Date - 05:01 PM, Thu - 28 November 24

She Is Male : లిన్ యూ టింగ్.. ఈమె తైవాన్‌కు చెందిన బాక్సర్. రెండు సార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచింది. అయితే ప్రతీసారి ఆమెను ఒక విషయం వెంటాడుతోంది. బాగా బాధపెడుతోంది. లిన్ యూ టింగ్ ఏ పోటీలకు వెళ్లినా.. ‘‘నువ్వు మహిళవేనా ? పురుషుడివా ?’’ అని అడుగుతున్నారు. ఈ ప్రశ్న ఆమెను చాలా కలచివేస్తోంది. తాను మహిళే అయినా ఇలాంటి ప్రశ్నలు అడగడం సరికాదని లిన్ యూ టింగ్ అభిప్రాయపడుతోంది. ప్రస్తుతం బ్రిటన్‌లో ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల ఫైనల్స్‌లో లిన్ యూ టింగ్ పాల్గొనాల్సి ఉంది.
Also Read :Red Planet Day : నవంబర్ 28న రెడ్ ప్లానెట్ డేని ఎందుకు జరుపుకుంటారు? ఈ సంవత్సరం థీమ్ ఏమిటి?
అయితే ఈ పోటీల నిర్వాహకులు ఆమెను మళ్లీ అవే ప్రశ్నలు అడిగి బాధపెట్టారు. నువ్వు మహిళవేనా అని అడిగారు. దీంతో లిన్ యూ(She Is Male) తీవ్ర అసహనానికి గురైంది. అలాంటి వాళ్లకు సమాధానం చెప్పడం ఇష్టం లేక పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించింది. ఈ అంశంపై ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల నిర్వాహకులు స్పందిస్తూ.. ‘‘మేం జెండర్ గురించి లిన్‌ను ఎక్కడా అడగలేదు. ఆమె అసలు ఈ ఈవెంట్‌లో పాల్గొనేందుకు రాలేదు’’ అని వెల్లడించారు.
Also Read :Extramarital Affair : వివాహేతర సంబంధాలు నెరిపే వాళ్లకు ‘రేప్ కేసు’ వర్తించదు : సుప్రీంకోర్టు
గత సంవత్సరం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో లింగ్ యూతో పాటు అల్జీరియా బాక్సర్ ఇమానె ఖెలిఫ్‌పై అనర్హత వేటు పడింది. ఈ ఇద్దరిలో పురుషులకు సంబంధించిన జన్యువులు ఎక్కువగా ఉన్నాయని తేలడంతో అధికారులు వారిపై అనర్హత వేటు వేశారు. అంతేకాదు.. లిన్ యూ గెల్చుకున్న కాంస్య పతకాన్ని రద్దు చేశారు. పురుషులతో సమానమైన బాక్సింగ్ సామర్థ్యాలు ఉన్నాయనే ఆరోపణలను లిన్ యూ టింగ్ ఎదుర్కొంటున్నారు.