Extramarital Affair : వివాహేతర సంబంధాలు నెరిపే వాళ్లకు ‘రేప్ కేసు’ వర్తించదు : సుప్రీంకోర్టు
ఇద్దరి అంగీకారంతో శారీరక సంబంధం(Extramarital Affair) పెట్టుకున్న తర్వాత.. వారి విషయంలో రేప్ కేసు వర్తించదని సుప్రీంకోర్టు తెలిపింది.
- Author : Pasha
Date : 28-11-2024 - 4:24 IST
Published By : Hashtagu Telugu Desk
Extramarital Affair : వివాహేతర సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లి చేసుకుంటారన్న హామీతోనే శారీరక సంబంధం పెట్టుకుంటారని కచ్చితంగా చెప్పలేమని న్యాయమూర్తులు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయ పడింది. పెళ్లయ్యాక మరొక వ్యక్తితో ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొనడం తప్పు కాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఇలాంటి అఫైర్స్ పెట్టుకునే మహిళలు సుదీర్ఘకాలం పాటు శృంగారం చేసి, కొన్ని విబేధాలతో విడిపోయాక.. సదరు పురుషుడిపై రేప్ కేసులు పెట్టడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పెళ్లి హామీతో అలాంటి శారీరక సంబంధాలు ఏర్పడవని.. లైంగిక వాంఛ అనే పునాదులపై అలాంటి వాళ్లు నిలబడతారని న్యాయస్థానం పేర్కొంది. ఇద్దరి అంగీకారంతో శారీరక సంబంధం(Extramarital Affair) పెట్టుకున్న తర్వాత.. వారి విషయంలో రేప్ కేసు వర్తించదని సుప్రీంకోర్టు తెలిపింది.
Also Read :Graduate MLC Elections : ‘గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ’ బరిలో జీవన్ రెడ్డి.. టీ కాంగ్రెస్ తీర్మానం
ఏమిటీ కేసు ?
ముంబైలోనే ఖర్ఘర్ ఏరియాకు చెందిన ఓ వివాహితుడి (మహేశ్ దాము ఖరే)పై ఒక వితంతువు(వనితా ఎస్ జాదవ్) ఏడేళ్ల క్రితం రేప్ కేసు పెట్టింది. ఖరే, వనితా ఎస్ జాదవ్ మధ్య 2008లో శారీరక సంబంధం మొదలైంది. కొన్ని రోజుల తర్వాత వారిద్దరూ విడిపోయారు. దీంతో ఖరే తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి మోసం చేశాడంటూ జాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దానిపై ఇవాళ విచారణ జరుపుతూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఆమె పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఏదిఏమైనప్పటికీ ఇటీవల కాలంలో దేశంలో వివాహేతర సంబంధాలతో ముడిపడిన పోలీసు కేసులు బాగానే నమోదవుతున్నాయి. ఈవిధమైన విచ్చలవిడి కల్చర్ వల్ల భారతీయ విలువలకు విఘాతం కలుగుతుందని పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సినిమాలు, పోర్న్ సైట్ల వల్ల ఈ తరహా కల్చర్ పెరుగుతోందని అంటున్నారు.