T20 World Cup: సౌతాఫ్రికా వైఫల్యంతోనే భారత్ గెలుపట.. వరల్డ్ కప్ విజయంపై ఆసీస్ మీడియా అక్కసు
భారత క్రికెట్ జట్టంటే ఎప్పుడూ విషం చిమ్మే ఆస్ట్రేలియా మీడియా మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది. టీమిండియా ప్రపంచకప్ విజయాన్ని తీసిపారేయడంతో పాటు చెత్త కథనాలు ప్రచురించింది. ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో ఓడిపోయే మ్యాచ్ గెలిచి
- By Praveen Aluthuru Published Date - 01:46 PM, Tue - 2 July 24

T20 World Cup: భారత క్రికెట్ జట్టంటే ఎప్పుడూ విషం చిమ్మే ఆస్ట్రేలియా మీడియా మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది. టీమిండియా ప్రపంచకప్ విజయాన్ని తీసిపారేయడంతో పాటు చెత్త కథనాలు ప్రచురించింది. ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో ఓడిపోయే మ్యాచ్ గెలిచిన భారత్ ను ప్రపంచవ్యాప్తంగా దేశాలతో సంబంధం లేకుండా అందరూ అభినందిస్తుంటే ఆసీస్ మీడియా మాత్రం అసూయతో ప్రవర్తించింది. సౌతాఫ్రికా చేతగానితనం వల్లనే భారత్ వరల్డ్ కప్ గెలిచిందంటూ కథనాలు ప్రసారం చేసింది.
సౌతాఫ్రికా తడబాటే టీ20 ప్రపంచకప్ లో భారత జట్టును విజేతగా నిలబెట్టిందంటూ క్యాప్షన్‌తో ఓ కథనాన్ని ప్రచురించింది. ఫైనల్లో సౌతాఫ్రికా విఫలమవడంతో పాటు అంపైర్ల నిర్ణయాలు భారత జట్టును గెలిపించాయంటూ ఆసీస్ ప్రధాన పత్రికలు కథనాలు రాశాయి. ఫైనల్ చేరినప్పుడు కూడా ఐసీసీ అండదండలతో అనుకూలమైన షెడ్యూల్‌తో భారత్ తుదిపోరుకు వచ్చిందని విమర్శలు గుప్పించింది. అయితే పాకిస్థాన్‌తో పాటు బ్రిటీష్ మీడియా మాత్రం భారత్ విజయాన్ని ప్రశంసించాయి.
పాకిస్థాన్‌కు చెందిన డాన్ పత్రిక… భారత గెలుపు క్షణాలకు సంబంధించిన ఫోటోని మొదటి పేజీలో ప్రచురించింది. గేరు మార్చి భారత్‌కు కప్పు అందించిన కోహ్లీ అంటూ లండన్ కు చెందిన సండే టైమ్స్ తన కథనంలో విరాట్ ను ఆకాశానికెత్తేసింది. దీంతో ప్రపంచం మొత్తం మేల్కొన్న ఆసీస్ మీడియా తన కుక్కు తోక వంకర బుద్ధిని చాటుకుందంటూ భారత అభిమానులు సెటైర్లు వేస్తున్నారు.
Also Read: CM Chandrababu: ఇసుక మాఫియా సీఎం గురి