Surya Kumar Yadav: రిపోర్టర్ కి సూర్య ఫన్నీ ఆన్సర్
వెస్టిండీస్ పర్యటనలో సూర్యకుమార్ యాదవ్ తన స్థాయికి దగ్గ ఆట ఆడట్లేదు. వన్డేల్లో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. పొట్టి ఫార్మెట్లో సత్తా చాటుతాడులే అనుకుంటే ఆ పరిస్థితి కనిపించలేదు.
- By Praveen Aluthuru Published Date - 06:16 PM, Wed - 9 August 23

Surya Kumar Yadav: వెస్టిండీస్ పర్యటనలో సూర్యకుమార్ యాదవ్ తన స్థాయికి దగ్గ ఆట ఆడట్లేదు. వన్డేల్లో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. పొట్టి ఫార్మెట్లో సత్తా చాటుతాడులే అనుకుంటే ఆ పరిస్థితి కనిపించలేదు. వెస్టిండీస్ తో జరుగుతున్న అయిదు టీ20 మ్యాచుల్లో రెండు మ్యాచ్ లో భారత్ ఓడిపోయింది. ఈ రెండు మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ పేలవ ప్రదర్శన కొనసాగించాడు. కానీ మూడో మ్యాచ్ లో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. నలువైపులా ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ బౌలర్లపై విరుచుకు పడ్డాడు. 44 బంతుల్లో 83 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. మ్యాచ్ అనంతరం రిపోర్టింగ్ ఇవ్వాల్సిన టైం లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
17 పరుగుల దూరంలో మీరు సెంచరీ మిస్ అయ్యారు. టీ20 ఫార్మెట్లో మూడో సెంచరీ చేయనందుకు బాధగా ఉందా అని రిపోర్టర్ అడగగా.. దానికి సూర్య ఇలా అన్నాడు. మీరు పొరపాటుపడుతున్నారు. మూడు సెంచరీలు పూర్తయ్యాయి. నాలుగో సెంచరీ మిస్ అయిందని ఫన్నీగా సమాధానమిచ్చాడు. దీంతో నవ్వులతో ఆ ప్రదేశమంతా హోరెత్తిపోయింది.
Also Read: No Confidence Motion: ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి బీఆర్ఎస్ మద్దతు