SRH : SRH కు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ భారీ ఆఫర్
SRH : విశాఖకు మంచి క్రికెట్ అభిమాన వాతావరణం ఉన్నందున SRH తమ మిగతా మ్యాచ్లను అక్కడ జరపాలనే ఆలోచనలో ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు
- Author : Sudheer
Date : 03-04-2025 - 1:11 IST
Published By : Hashtagu Telugu Desk
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంచైజీకి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) కీలక నిర్ణయం తీసుకుంది. SRH జట్టును ఆంధ్రప్రదేశ్‌కు ఆహ్వానిస్తూ, మిగతా ఐపీఎల్ మ్యాచ్‌లను విశాఖపట్నంలో నిర్వహించాలని సూచించింది. విశాఖలో మ్యాచ్‌లను నిర్వహిస్తే పన్ను మినహాయింపులు కూడా ఇస్తామని ACA హామీ ఇచ్చింది.
Warangal Chapata : వరంగల్ చపాటా మిర్చికి ‘జీఐ’ గుడ్ న్యూస్.. ప్రత్యేకతలివీ
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో SRH హోం మ్యాచ్లు జరుగుతుండగా, కాంప్లిమెంటరీ టికెట్ల వ్యవహారంపై SRH మరియు HCA మధ్య విభేదాలు వచ్చాయి. ఈ వివాదం పెరిగిన తరుణంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవడంతో HCA వెనక్కి తగ్గింది. అయినప్పటికీ SRH యాజమాన్యం ఇంకా ఈ సమస్యపై స్పష్టత ఇవ్వలేదు.
Mohammed Siraj: ఆర్సీబీపై గుజరాత్ విజయం.. సిరాజ్ వ్యాఖ్యలు వైరల్
ఇదిలా ఉంటె ఈ ఐపీఎల్ సీజన్‌లో విశాఖలో రెండు మ్యాచ్‌లు విజయవంతంగా నిర్వహించారు. విశాఖకు మంచి క్రికెట్ అభిమాన వాతావరణం ఉన్నందున SRH తమ మిగతా మ్యాచ్లను అక్కడ జరపాలనే ఆలోచనలో ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ACA ఇచ్చిన ఆహ్వానంపై SRH యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిందే.