HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Steve Smith To Return As Australia Test Captain

Steve Smith: ఆస్ట్రేలియా పగ్గాలు మళ్ళీ స్మిత్ చేతికే

టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకోవడానికి ఆస్ట్రేలియా సిడ్నీ టెస్టుతో పాటు శ్రీలంకతో ఆడిన రెండు టెస్టు మ్యాచ్‌లలో ఒకదానిలో విజయం సాధించాల్సి ఉంది.

  • By Naresh Kumar Published Date - 12:35 PM, Tue - 7 January 25
  • daily-hunt
Steve Smith
Steve Smith

Steve Smith: పాట్ కమిన్స్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించి 10 ఏళ్ల తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని గెలుచుకుంది. సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఈ విజయం తర్వాత ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్సీలో మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. మళ్లీ స్టీవ్ స్మిత్ (Steve Smith) టెస్టు జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

సిడ్నీ టెస్టు విజయంతో ఆస్ట్రేలియా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇప్పుడు ఆసీస్ శ్రీలంకతో తదుపరి టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌కి కమిన్స్ దూరం కానున్నాడు. తన కుటుంబ సభ్యులతో సమయం కేటాయించేందుకు కమిన్స్ క్రికెట్ ఆస్ట్రేలియాను కోరాడట. నివేదిక ప్రకారం కమిన్స్ తన భార్య రెండవ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పాట్ కమిన్స్ శ్రీలంక సిరీస్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. దానికి ఆస్ట్రేలియా కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో స్టీవ్ స్మిత్ మరోసారి ఆస్ట్రేలియా పగ్గాలు చేపట్టనున్నాడు. 2018 మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగిన కెప్‌టౌన్ టెస్టు సందర్భంగా స్మిత్ బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. దాంతో అతడి కెప్టెన్సీ కూడా ఊడింది. ఈ ఘటన క్రికెట్ ఆస్ట్రేలియా చరిత్రలోనే పెద్ద మచ్చగా మిగిలిపోయింది.

టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకోవడానికి ఆస్ట్రేలియా సిడ్నీ టెస్టుతో పాటు శ్రీలంకతో ఆడిన రెండు టెస్టు మ్యాచ్‌లలో ఒకదానిలో విజయం సాధించాల్సి ఉంది. భారత్‌ను ఓడించి ఫైనల్‌కు చేరినందున శ్రీలంకతో జరిగే సిరీస్‌ కీలకంగా మారింది.ఫైనల్లో దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా తలపడనుంది. ఇక భారత్‌తో జరిగిన సిరీస్‌లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ పెద్దగా రాణించలేదు. దీంతో సెలెక్టర్లు శ్రీలంకపై బ్యాటింగ్ ఆర్డర్‌పై ప్రయోగాలు చేయవచ్చు, తద్వారా దక్షిణాఫ్రికాతో టైటిల్ మ్యాచ్‌కు జట్టు పూర్తిగా సన్నద్ధమవుతోంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • australia
  • Australia Test captain
  • cricket
  • sports news
  • Steve Smith
  • Test Captain

Related News

Minister Lokesh

Minister Lokesh: ఏపీలో ఆస్ట్రేలియా పెట్టుబడులకు సహకరించండి: మంత్రి లోకేష్

నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న పార్టనర్ షిప్ సమ్మిట్- 2025కు ఫోరం నాయకత్వ బృందంతో కలసి తప్పక హాజరుకావాల్సిందిగా మంత్రి లోకేష్ మెక్ కేని ఆహ్వానించారు.

  • Virat Kohli

    Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు..!

  • IND vs AUS

    IND vs AUS: నిరాశ‌ప‌ర్చిన రోహిత్‌, కోహ్లీ.. మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం!

  • Shubman Gill

    Shubman Gill: రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీల‌పై గిల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

  • IND vs AUS

    IND vs AUS: రేపే భార‌త్‌- ఆస్ట్రేలియా మ‌ధ్య తొలి మ్యాచ్‌.. పెర్త్‌లో ఆసీస్ రికార్డు ఎలా ఉందంటే?

Latest News

  • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

  • CNG Cars: త‌క్కువ బ‌డ్జెట్‌లో సీఎన్‌జీ కారును కొనుగోలు చేయాల‌ని చూస్తున్నారా?

  • Sadar Sammelan: సదర్ సమ్మేళనానికి సర్వం సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి రాక!

  • TTD Chairman: ఈ నెంబ‌ర్‌కు కాల్ చేయండి.. శ్రీవారి భ‌క్తుల‌కు టీటీడీ ఛైర్మన్ విజ్ఞప్తి!

  • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

Trending News

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd