Duddilla Sridhar Babu : బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడిగా మంత్రి శ్రీధర్ బాబు
Duddilla Sridhar Babu : శుక్రవారం తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడి(President of the Telangana Badminton Association)గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
- Author : Sudheer
Date : 03-01-2025 - 8:57 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి(Minister for IT and Industries)గా బాధ్యతలు నిర్వహిస్తున్న దుదిల్ల శ్రీధర్ బాబు (Duddilla Sridhar Babu) శుక్రవారం తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడి(President of the Telangana Badminton Association)గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ఫలితాలు భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పుల్లెల గోపిచంద్ (Pullela Gopichand) ప్రకటించారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు ను సచివాలయంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీధర్ బాబు.. తెలంగాణను క్రీడల హబ్ తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈమేరకు స్పోర్ట్స్ వర్సిటీని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో యువత సత్తా చాటాలనేదే తమ లక్ష్యమని తెలిపారు ఒక చిన్న క్రీడా విశ్వవిద్యాలయం ద్వారా ఇటీవల పారిస్ ఒలింపిక్స్‌లో 37 పతకాలు సాధించిన సౌత్ కొరియా ఉదాహరణగా తీసుకుంటూ, తెలంగాణలో ఒక ప్రత్యేక క్రీడా విశ్వవిద్యాలయాన్ని స్థాపించే ప్రణాళికలను వెల్లడించారు.
High Blood Pressure : మీకు హైబీపీ ఉందా..? అయితే ఈ ఆహారం అస్సలు తినొద్దు..!
విద్యా రంగం మరియు క్రీడల సమన్వయంతో కూడిన కార్యక్రమాలను రూపొందించడం ద్వారా యువతను క్రీడా రంగంలో కూడా పోటీకి సిద్దం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పల్లెప్రాంతాలలోని ప్రతిభావంతులైన ఆటగాళ్లను ప్రోత్సహించడానికి ప్రత్యేక క్రీడా కేంద్రాలను ఏర్పాటుచేయాలని ఆయన అన్నారు. అలాగే, ప్రభుత్వ పాఠశాలల్లోని మౌలిక సదుపాయాలను ప్రైవేట్ సంస్థలతో సమానంగా అభివృద్ధి చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా ప్రతిభను వెలుగులో తేవాలని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ సందర్బంగా పుల్లెల గోపిచంద్, తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలను మెచ్చుకున్నారు.