Sri Lanka Player: స్టార్ క్రికెటర్‌పై ఏడాది నిషేధం
టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఆటగాళ్ల ఒప్పందం ప్రకారం పలు నిబంధనలను ఉల్లంఘించినందుకు
- Author : Gopichand
Date : 24-11-2022 - 1:50 IST
Published By : Hashtagu Telugu Desk
టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఆటగాళ్ల ఒప్పందం ప్రకారం పలు నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆల్ రౌండర్ చమికా కరుణరత్నేపై శ్రీలంక క్రికెట్ బోర్డు అన్ని రకాల క్రికెట్‌ల నుంచి ఏడాది పాటు నిషేధం విధించింది. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సీ) బుధవారం ధృవీకరించింది. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో బోర్డుకు సంబంధించిన పలు అగ్రిమెంట్‌లను కరుణరత్నే ఉల్లంఘించడంతో వేటు వేసింది. అతడిపై నిషేదం విధించడమే కాకుండా 5000 వేల డాలర్ల (భారత కరన్సీ ప్రకారం రూ. 3.71 లక్షలు) జరిమానా కూడా విధించింది.
ముగ్గురు సభ్యుల విచారణ ప్యానెల్ ఫలితాలు, సిఫార్సుల ఆధారంగా SLC ఎగ్జిక్యూటివ్ కమిటీ నిషేధాన్ని విధించింది. ఈ ఏడాది ప్రారంభంలో శ్రీలంక ఆసియా కప్ గెలవడంలో చమికా కరుణరత్నే కీలక పాత్ర పోషించాడు. ఇటీవల ఆస్ట్రేలియాలో ముగిసిన T20 ప్రపంచ కప్‌లో ఏడు మ్యాచ్‌లలో మూడు వికెట్లు తీశాడు. తనపై మోపిన అన్ని ఆరోపణలను ఆయన అంగీకరించారు.
ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో దనుష్క గుణతిలక తర్వాత దుష్ప్రవర్తనపై నిషేధానికి గురైన రెండో ఆటగాడు కరుణరత్నే. “కరుణారత్నే ఉల్లంఘనల తీవ్రత దృష్ట్యా విచారణ కమిటీ భవిష్యత్తులో కరుణరత్నే అలా చేయకూడదని గట్టిగా హెచ్చరించాలని SLC ఎగ్జిక్యూటివ్ కమిటీకి సిఫార్సు చేసింది అని SLC నుండి ఒక ప్రకటనలో పేర్కొంది. అలాగే కరుణరత్నే క్రికెట్ కెరీర్‌పై పెద్దగా ప్రభావం చూపని ఇలాంటి శిక్ష విధించినట్లు SLC తెలిపింది.