HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >South Africa Vs Zimbabwe T20 Match Cancel Due To Rain

T20 Match : దురదృష్ఠం అంటే సౌతాఫ్రికాదే… గెలుపు ముంగిట మ్యాచ్ రద్దు

ప్రపంచ క్రికెట్ లో అత్యంత దురదృష్టం వెంటాడే జట్టు ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా దక్షిణాఫ్రికానే. ముఖ్యంగా మెగా టోర్నీ..

  • Author : Prasad Date : 25-10-2022 - 10:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
South Africa Imresizer
South Africa Imresizer

ప్రపంచ క్రికెట్ లో అత్యంత దురదృష్టం వెంటాడే జట్టు ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా దక్షిణాఫ్రికానే. ముఖ్యంగా మెగా టోర్నీ ల్లో ఎప్పుడూ వర్షం ఆ జట్టుపై పగ పడుతూనే ఉంటుంది. 1992 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్లో ఆ టీమ్‌ వర్షం దెబ్బకు ఎలా ఇంటిదారి పట్టింది. తాజాగా టీ20 వరల్డ్‌కప్‌లోనూ సోమవారం జింబాబ్వేతో మ్యాచ్‌లో విజయానికి చేరువగా వచ్చిన సమయంలో వర్షం వల్ల అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో రెండు టీమ్స్‌ చెరొక పాయింట్‌ పంచుకున్నాయి. ఈ మ్యాచ్‌కు మొదటి నుంచీ వర్షం అడ్డుపడుతూనే ఉంది. మ్యాచ్‌ రెండు గంటల 35 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో అంపైర్లు ఈ మ్యాచ్‌ను 9 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 9 ఓవర్లలో 5 వికెట్లకు 79 రన్స్‌ చేసింది. అయితే ఆ తర్వాత మళ్లీ వర్షం కురవడంతో సౌతాఫ్రికా టార్గెట్‌ను 7 ఓవర్లలో 64 రన్స్‌గా నిర్ణయించారు.

వర్షాన్ని దృష్టిలో ఉంచుకుని సఫారీ ఓపెనర్లు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. డికాక్ తొలి ఓవర్లో 23 రన్స్ చేశాడు. తర్వాతి ఓవర్ లోనూ అతని మరింత రెచ్చిపోవడంతో సౌతాఫ్రికా 3 ఓవర్లలోనే 51 పరుగులు చేసింది. క్వింటన్‌ డికాక్‌ 18 బాల్స్‌లోనే 8 ఫోర్లు, ఒక సిక్స్‌తో 47 రన్స్‌ చేశాడు. అప్పటికే సౌతాఫ్రికా డక్ వర్త్ స్కోరు కంటే ఎంతో ముందుంది. మరొక్క బాల్‌ ఆడినా కూడా మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలిచేదే. అయితే అదే సమయంలో భారీ వర్షం కురవడంతో మళ్లీ మ్యాచ్‌ను నిర్వహించడం సాధ్యం కాదంటూ అంపైర్లను రద్దు చేశారు.ఈ మ్యాచ్‌లో విజయంతో రెండు పాయింట్లు సులువుగా పొందే వీలున్నా.. సౌతాఫ్రికా ఇప్పుడు ఒక పాయింట్‌తో సరిపెట్టుకుంది. ఇది ఆ టీమ్‌ నాకౌట్ అవకాశాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cricket south africa
  • ICC T20 world cup
  • rain
  • south africa
  • T20 world cup 2022
  • Zimbabwe

Related News

Mike Hesson Dressing Room

భారత్‌ చేతిలో ఓటమి కారణం ఇదే.. కోచ్ సంచలన వ్యాఖ్యలు!

Ind Vs Pak  భారత్‌తో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో ఓడిన తర్వాత పాకిస్తాన్ జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో తీవ్ర నిరాశ నెలకొందని హెడ్ కోచ్ మైక్ హెస్సెన్ చెప్పాడు. ఆటగాళ్లు భావోద్వేగంగా కుంగిపోయారని తెలిపాడు. ఇషాన్ కిషన్ అద్భుత ఇన్నింగ్స్, బుమ్రా దెబ్బతో పాక్ పతనం అయింది. అయినా టోర్నీలో ఇంకా ఆశ ఉందని హెస్సెన్ నమ్మకం వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ తన చివరి మ్యాచ్‌ను నమీ

  • Suryakumar Yadav

    ఈ విజయం భారత్‌ కు అంకితం..కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్

  • Zimbabwe Beat Australia

    ఆస్ట్రేలియాకు భారీ షాక్ ఇచ్చిన జింబాబ్వే!

  • Saqlain Mushtaq

    ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కొలంబోలో పిచ్‌ను ఎప్పుడైనా మార్చొచ్చు: పాక్‌ మాజీ క్రికెటర్‌

  • Quinton de Kock

    ధోనీ రికార్డును బ్రేక్ చేయ‌లేక‌పోయిన డి కాక్‌!

Latest News

  • తెలంగాణ మార్కెట్లోకి ‘వర్క్‌మాస్టర్ 105’ ట్రాక్టర్‌

  • Richest Village : ప్రపంచంలోనే ధనిక గ్రామం ఏ రాష్ట్రంలో ఉందొ తెలుసా ?

  • కన్నీళ్లు పెట్టుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు..!

  • CM Revanth : సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

  • I PHONE : మీరు IPHone వాడుతున్నారా..? అయితే వెంటనే ఈ పని చెయ్యండి !!

Trending News

    • లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

    • టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ నుంచి బంపర్ ఆఫర్!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. పాకిస్థాన్‌తో సహా ఈ 5 జ‌ట్లు క‌ష్ట‌మే!

    • బంగారం ధ‌ర ప‌డిపోనుందా? విశ్లేష‌కులు ఏం చెబుతున్నారంటే?

    • భార‌త్‌- పాక్ మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్ జ‌ర‌గ‌నుందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd