HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >South Africa Maintain Their Lead At The Head Of The World Test Championship Standings

ICC Ranking:టెస్టు లీగ్ లో సఫారీలు అప్.. ఇండియా డౌన్..!

ఐసీసీ టెస్టు లీగ్ చాంపియన్ షిప్ లో దక్షిణాఫ్రికా టాప్ గేర్ లో దూసుకుపోతుంటే.. డిఫెండింగ్ చాంపియన్ న్యూజిలాండ్ అట్టడుగుకు పడిపోయింది.

  • By Hashtag U Published Date - 05:56 PM, Wed - 24 August 22
  • daily-hunt
Team India West Indies Imresizer
Team India West Indies Imresizer

ఐసీసీ టెస్టు లీగ్ చాంపియన్ షిప్ లో దక్షిణాఫ్రికా టాప్ గేర్ లో దూసుకుపోతుంటే.. డిఫెండింగ్ చాంపియన్ న్యూజిలాండ్ అట్టడుగుకు పడిపోయింది. రన్నరప్ భారత్ నాలుగోస్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లండ్ లోని లార్డ్స్‌ స్టేడియం వేదికగా ఆతిథ్య జట్టుతో ముగిసిన మూడు మ్యాచ్ ల సిరీస్ లోని తొలిటెస్టులో దక్షిణాఫ్రికా జట్టు ఇన్నింగ్స్ విజయం సాధించడం ద్వారా టెస్టులీగ్ పాయింట్ల పట్టిక అగ్రస్థానానికి దూసుకెళ్లింది. టెస్టు లీగ్ ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకూ ఎనిమిది టెస్టులు ఆడిన సఫారీ జట్టు 6 విజయాలతో 72 పాయింట్లు సాధించడం ద్వారా టేబుల్ టాపర్ గా నిలిచింది. డీన్ ఎల్గర్ నాయకత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు మిగిలిన జట్లకంటే ప్రస్తుతం మెరుగైన జట్టుగా కనిపిస్తోంది. కాగా గత సీజన్ టెస్టు లీగ్ విజేత న్యూజిలాండ్, భారత్ టేబుల్ మొదటి మూడుస్థానాలలో నిలవడంలో విఫలమయ్యాయి.

4వ స్థానంలో భారత్.. ఆస్ట్రేలియా జట్టు 70 పాయింట్లు సాధించడం ద్వారా రెండోస్థానంలో కొనసాగుతోంది 53.33 పాయింట్లతో శ్రీలంక మూడు, 52.08 పాయింట్లతో భారత్ నాలుగు స్థానాలలో నిలిచాయి. 51.85 శాతం పాయింట్లతో పాకిస్థాన్ ఐదు, 50 పాయింట్లతో వెస్టిండీస్ ఆరు స్థానాలు సంపాదించాయి. ఇంగ్లండ్ మాత్రం 31.37 శాతం పాయింట్లతో 7వ స్థానంలో ఉంటే.. గత సీజన్ లీగ్ విన్నర్ న్యూజిలాండ్ 25.93 పాయింట్లతో 8వ స్థానానికి పడిపోయింది. 13.33 పాయింట్లతో బంగ్లాదేశ్ లీగ్ టేబుల్ అట్టడుగున నిలిచింది.

సఫారీ దెబ్బకు బజ్ బాల్ ఢమాల్! బెన్ స్టోక్స్ కెప్టెన్ గా, బ్రెండన్ మెకల్లమ్ చీఫ్ కోచ్ గా ఆడిన గత నాలుగు టెస్టుల్లో తిరుగులేని విజయాలు సాధించడం ద్వారా బజ్ బాల్ శకం ప్రారంభమయ్యిందంటూ నానాహంగామా చేస్తున్న ఇంగ్లండ్ జట్టు ఇన్నింగ్స్ ఓటమితో నేలమీదకు దిగి వచ్చింది. చరిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ స్టేడియం వేదికగా ముగిసిన తొలిటెస్టులో దక్షిణాఫ్రికాజట్టు కేవలం మూడురోజుల ఆటలోనే ఆతిథ్య ఇంగ్లండ్ జట్టును ఇన్నింగ్స్ 12 పరుగుల తేడాతో చిత్తు చేసి.. మూడుమ్యాచ్ ల సిరీస్ లోని తొలిటెస్టు ముగిసే సమయానికి 1-0 ఆధిక్యం సంపాదించింది. స్వదేశంలో ఇంగ్లండ్ జట్టు ఇన్నింగ్స్ ఓటమి పాలుకావడం గత 19 సంవత్సరాలలో ఇదే తొలిసారి. 2003లో సైతం దక్షిణాఫ్రికా ప్రత్యర్థిగానే ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ 92 పరుగుల తేడాతో ఓటమి చవిచూడటం విశేషం.

సఫారీ పేస్ కు ఇంగ్లండ్ స్మాష్.. స్వదేశంలో అజేయమైన జట్టుగా నిలిచిన ఇంగ్లండ్ ప్రస్తుత సిరీస్ లోని తొలిటెస్టులో సఫారీ ఫాస్ట్ బౌలర్ల త్రయం నోర్జే, రబడా, ఎంగిడీల పేస్ కు బదులు చెప్పలేకపోయింది. టెస్టుమ్యాచ్ తొలిరోజు ఆటకు వానదెబ్బ తగిలినా కేవలం ఆరు సెషన్లలోనే ఇంగ్లండ్ ను రెండుసార్లు ఆలౌట్ చేయడం ద్వారా దక్షిణాఫ్రికా సంచలన విజయం సాధించింది. స్పిన్ జోడీ రబాడ, నోర్జే, స్పిన్నర్ కేశవ్ మహరాజ్ ల ముప్పేట దాడికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక..రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ కేవలం 37.4 ఓవర్లలోనే 149 పరుగులకే కుప్పకూలిపోయింది. నోర్జే 6 వికెట్లు, రబడ 7 వికెట్లతో చెలరేగిపోయారు. మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ లోనూ కలిపి 7 వికెట్లు పడగొట్టిన ఫాస్ట్ బౌలర్ కిగిసో రబాడ‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్ లోని కీలక రెండోటెస్టు ఆగస్టు 25న ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా ప్రారంభమవుతుంది. జో రూట్ నాయకత్వంలో ఆడిన 17 టెస్టుల్లో ఒక్క గెలుపు మాత్రమే సాధించిన ఇంగ్లండ్ జట్టు..గత ఐదుటెస్టులుగా ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కెప్టెన్సీలో పాల్గొంటూ వస్తోంది. భారత్ ను సైతం చిత్తు చేయడం ద్వారా గత ఐదుటెస్టుల్లో నాలుగు విజయాలు సాధించిన ఇంగ్లండ్ కు ఇదే తొలి పరాజయం. ఈ ఓటమి తమకు మేలుకొలుపు లాంటిది ఏమాత్రం కాదని, వ్యూహాలను అనుకొన్నట్లుగా అమలు చేయలేకపోయామని, ఈ ఓటమి దురదృష్టకరమని మ్యాచ్ అనంతరం కెప్టెన్ బెన్ స్టోక్స్ వ్యాఖ్యానించాడు. సిరీస్ లోని రెండోటెస్టులో మెరుగైన ఆటతీరు ప్రదర్శిస్తామని ప్రకటించాడు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ICC test rank
  • India at 4 th palce
  • south africa
  • team india

Related News

IND vs SA

IND vs SA: సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు సన్నద్ధమవుతున్న భారత క్రికెటర్లు!

దక్షిణాఫ్రికా జట్టు ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌గా ఉంది. పాకిస్తాన్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకుని భారత పర్యటనకు వస్తోంది. మరోవైపు భారత జట్టు WTC 2025-27 సైకిల్‌లో తమ మొదటి సిరీస్‌ను ఇంగ్లాండ్‌తో ఆడింది.

  • Abhishek Sharma

    Abhishek Sharma: సూర్య‌కుమార్ యాద‌వ్ రికార్డును బ్రేక్ చేసిన యంగ్ ప్లేయ‌ర్‌!

  • Dismissed On 99

    Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

  • Sanju Samson

    Sanju Samson: సంజూ శాంసన్ బ్యాటింగ్‌తో ఎందుకు ఆడుకుంటున్నారు?

  • Raina- Dhawan

    Raina- Dhawan: టీమిండియా మాజీ క్రికెట‌ర్లు రైనా, ధావన్‌లకు బిగ్ షాక్‌!

Latest News

  • Kumki Elephants Camp : కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్

  • Rajnath Singh : రేవంత్ ‘ముస్లిం’ వ్యాఖ్యలపై మండిపడ్డ రాజ్నాథ్ సింగ్

  • Minister Nimmala : కూలీలా మారిన ఏపీ మంత్రి

  • Kavitha : హరీశ్ రావుపై మరో అవినీతి బాంబ్ పేల్చిన కవిత..!!

  • Jubilee Hills Bypoll : హిందువులు మీతో లేరని ఒప్పుకుంటారా?: రేవంత్

Trending News

    • Digital Gold: డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా? మీకొక షాకింగ్ న్యూస్‌!

    • IND vs AUS: భార‌త్‌- ఆస్ట్రేలియా మ్యాచ్ ర‌ద్దు కావ‌డానికి కార‌ణం పిడుగులేనా?

    • Strong Room: ఎన్నిక‌ల త‌ర్వాత ఈవీఎంల‌ను స్ట్రాంగ్ రూమ్‌లో ఎందుకు ఉంచుతారు?

    • Junio Payments: బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ.. పిల్లలు కూడా ఆన్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు!

    • India- Pakistan: ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించిన జ‌ట్లు ఇవే.. పాక్ క‌ష్ట‌మే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd