Sourav Ganguly: టెస్టుల్లో హార్దిక్ పాండ్యా ఆడాలి: గంగూలీ
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. టైటిల్ మ్యాచ్‌లో రోహిత్ సేన ఏ మాత్రం ప్రభావం చూపించకపోవడంతో భారత టెస్టు జట్టు
- Author : Praveen Aluthuru
Date : 14-06-2023 - 4:02 IST
Published By : Hashtagu Telugu Desk
Sourav Ganguly: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. టైటిల్ మ్యాచ్‌లో రోహిత్ సేన ఏ మాత్రం ప్రభావం చూపించకపోవడంతో భారత టెస్టు జట్టులో మార్పు చేయాలనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తుంది. తాజాగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇదే విషయంపై తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ గంగూలీ మాట్లాడుతూ.. ఒక్క ఓటమి కారణంగా జట్టుని అంచనా వేసి తుది నిర్ణయానికి రావద్దని అభిప్రాయం తెలిపాడు. కోహ్లి, పుజారాలను పక్కన పెట్టొద్దని అలాగే హార్దిక్ పాండ్యా టెస్ట్ క్రికెట్ ఆడాలి అని అన్నాడు సౌరవ్ గంగూలీ. భారత్‌లో చాలా మంది రిజర్వ్ ఆటగాళ్లు ఉన్నారు. జైవాల్ కావచ్చు లేదా రజత్ పాటిదార్. బెంగాల్ తరఫున అభిమన్యు ఈశ్వరన్ కూడా చాలా పరుగులు చేస్తున్నాడు. శుభమాన్ గిల్ ఇంకా చిన్నవాడు, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు మరియు హార్దిక్ పాండ్యా నా మాట వింటాడని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో అతను టెస్టు క్రికెట్ ఆడాలని నేను కోరుకుంటున్నాను అని గంగూలీ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు.
వెన్ను గాయం కారణంగా హార్దిక్ పాండ్యా సుదీర్ఘ క్రికెట్ ఫార్మాట్‌కు దూరంగా ఉన్నాడు. స్టార్ ఆల్ రౌండర్ చివరిసారిగా 2018లో భారత్ తరఫున టెస్టు మ్యాచ్ ఆడాడు. అప్పటి నుండి హార్దిక్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రమే ఆడాడు. కాని అతను టెస్టుల్లో ఆడటం లేదు. హార్దిక్ తన కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం 11 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అందులో 532 పరుగులు చేసి 17 వికెట్లు తీసుకున్నాడు.
Read More: KL Rahul: ఆసియా కప్ కోసం సిద్దమవుతున్న కేఎల్ రాహుల్