HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Siraj Replaces Bumrah For Last Two South Africa T20is

3rd T20I : బూమ్రా ప్లేస్‌లో హైదరాబాదీ పేసర్

సౌతాఫ్రికాతో సిరీస్‌ నుంచి స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా దూరమవడంతో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు అవకాశం దక్కింది.

  • Author : Hashtag U Date : 30-09-2022 - 11:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mohammed Siraj
Mohammed Siraj

సౌతాఫ్రికాతో సిరీస్‌ నుంచి స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా దూరమవడంతో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు అవకాశం దక్కింది. సౌతాఫ్రికాతో మిగిలిన రెండు టీ ట్వంటీలకు బూమ్రా స్థానంలో సిరాజ్‌ను ఎంపిక చేసినట్టు బీసీసీఐ ప్రకటించింది. ఐపీఎల్‌లో నిలకడగా రాణించినప్పటకీ సిరాజ్‌ను టీ ట్వంటీ వరల్డ్‌కప్‌ ఎంపికలో సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. కోవిడ్ నుంచి కోలుకున్న సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ పేరును కూడా పరిశీలనలోకి తీసుకున్నప్పటికీ సిరాజ్ వైపే సెలక్టర్లు మొగ్గు చూపారు. సౌతాఫ్రికాతో మిగిలిన రెండు మ్యాచ్‌లలో తుది జట్టులో సిరాజ్‌కు చోటు దక్కే అవకాశముంది.ఈ రెండు మ్యాచ్‌లలో సిరాజ్ సత్తా చాటితే టీ ట్వంటీ వరల్డ్‌కప్‌కూ ఎంపికయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం బూమ్రా కోలుకునే అవకాశాలు లేవు. అదే సమయంలో షమీ ఫిట్‌నెస్‌పైనా సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలో సిరాజ్‌ను స్టాండ్ బై ప్లేయర్స్‌గా ఎంపిక చేయొచ్చని అంచనా వేస్తున్నారు. ఏదిఏమైనా సఫారీలతో సిరీస్ సిరాజ్ వరల్డ్‌కప్ బెర్తులు డిసైడ్ చేయనుంది. ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడుతోన్న భారత క్రికెట్ జట్టు.. అస్సాం చేరుకుంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా 1-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. తిరువనంతపురంలో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసిన రోహిత్‌సేన గువాహటి స్టేడియంలో ఆదివారం రెండో మ్యాచ్‌ ఆడనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Jasprit Bumrah
  • Mohammed Siraj
  • T20 matches

Related News

Jasprit Bumrah

సౌతాఫ్రికాతో మ్యాచ్‌.. బుమ్రా స‌రికొత్త రికార్డు!

జస్ప్రీత్ బుమ్రా మాత్రమే కాకుండా, మరో ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా రవిచంద్రన్ అశ్విన్ రికార్డును సమం చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు.

  • Varun Chakravarthy

    బుమ్రా కాదు.. దక్షిణాఫ్రికాకు ఆ బౌలరే పెద్ద సవాలు!

  • India Vs South Africa

    రేపు సఫారీలతో టీమిండియా అమీతుమీ

Latest News

  • రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు .. నన్ను ఉద్దేశపూర్వకంగా ఇరికించారు : సునీల్ కీలక ఆరోపణలు

  • ఇంకా ఎంతకాలం జీవించి ఉంటానో తెలియదు .. మరణం పై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

  • అమెరికా ఈశాన్యాన్ని వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’.. స్తంభించిన జనజీవనం .. వేల విమానాల రద్దు ..!

  • వారికి ప్రత్యేక వెయిటేజ్ : కొత్త విధానానికి సీఎం చంద్రబాబు శ్రీకారం

  • తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు

Trending News

    • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

    • తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

    • టీమ్ ఇండియాకు షాక్.. సెమీస్ దారులు మూసుకుపోయినట్లేనా?

    • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

    • బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd