Shubman Gill: శుభ్‌మన్ బ్యాలెన్స్‌ను కాపాడుకోగలిగితే పరుగుల వరదే: గవాస్కర్
ఐపీఎల్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ 129 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 23 ఏళ్ల ఈ బ్యాట్స్‌మన్ కేవలం 60 బంతుల్లో 129 పరుగులతో మ్యాచ్ ని గెలిపించాడు.
- By Praveen Aluthuru Published Date - 02:49 PM, Sat - 27 May 23

Shubman Gill: ఐపీఎల్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ 129 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 23 ఏళ్ల ఈ బ్యాట్స్‌మన్ కేవలం 60 బంతుల్లో 129 పరుగులతో మ్యాచ్ ని గెలిపించాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా గుజరాత్ 62 పరుగుల తేడాతో ముంబైని ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ఈ సీజన్‌లో గిల్ ఇప్పటి వరకు మూడు సెంచరీలు సాధించాడు. ఈ సీజన్‌లో శుభ్‌మన్ గిల్ ఇప్పటి వరకు 800కు పైగా పరుగులు చేశాడు.
గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండోసారి ఫైనల్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా భారత మాజీ బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. బంతి డెలివరీ అయిన క్రమంలో షాట్ ఆడుతున్నప్పుడు గిల్ తన బ్యాలెన్స్‌ను కాపాడుకోగలిగితే గిల్ ని ఏ బౌలర్ ఆపలేడని చెప్పారు. అది బ్యాలన్స్ చేయగలిగితే గిల్ బ్యాట్ నుండి పరుగులు వెల్లువెత్తుతాయని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. గిల్ ప్రస్తుత ఫామ్ గుజరాత్ టైటాన్స్‌కు మాత్రమే కాదు టీమ్ ఇండియాకు కూడా చాలా ఉపయోగపడనుందని అన్నారు గవాస్కర్.
ప్రస్తుతానికి గిల్ తన అద్భుత ప్రదర్శనతో బౌలర్లను నిస్సాయులుగా మార్చాడని ,నిజానికి, శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ స్కిల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయని అన్నారు. ప్రతి ఇన్నింగ్స్‌లోనూ మెరుగ్గా రాణిస్తున్నాడు. కాబట్టి ఇది గుజరాత్ టైటాన్స్‌కు మాత్రమే కాదు, టీమిండియాకు కూడా శుభవార్త అంటూ గిల్ పై ప్రశంసలు కురిపించాడు సునీల్ గవాస్కర్.
Read More: TDP Mahanadu 2023: సైకో జగన్ ఏపీని నాశనం చేశాడు : చంద్రబాబు