7 sixes 1 over: ఒకే ఓవర్లో ఏడు సిక్సర్లు.. యూవీ రికార్డు బద్దలు
2007 టీ ట్వంటీ వరల్డ్ కప్ లో యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్ పై ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన రికార్డు ఫాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. ఇప్పుడు ఆ
- By Hashtag U Published Date - 03:20 PM, Mon - 28 November 22
2007 టీ ట్వంటీ వరల్డ్ కప్ లో యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్ పై ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన రికార్డు ఫాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది. ఒకే ఓవర్లో ఆరు కాదు ఏడు సిక్సర్లతో సరికొత్త రికార్డు నమోదయింది. టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఈ అరుదైన రికార్డు సాధించాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న రుతురాజ్.. ఉత్తర్ ప్రదేశ్‌తో రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు.
యూపీ బౌలర్ శివా సింగ్ వేసిన 49వ ఓవర్లో రుతురాజ్ విధ్వంసం సృష్టించాడు. వరుసగా నాలుగు బంతులను రుతురాజ్ సిక్సర్లుగా కొట్టగా.. ఒత్తిడికి గురైన బౌలర్ ఐదో బంతిని నోబాల్‌గా వేసాడు. ఆ బంతిని కూడా సిక్స్ బాదిన రుతురాజ్ తర్వాతి రెండు బంతులను కూడా సిక్సర్లు బాది చరిత్ర సృష్టించాడు. దాంతో ఈ ఓవర్లో 43 పరుగులు వచ్చాయి. రుతురాజ్ వరల్డ్ రికార్డు నమోదు చేస్తే.. ఒక ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న చెత్త రికార్డును శివా సింగ్ మూటగట్టుకున్నాడు. రుతురాజ్ విధ్వంసంతో మహారాష్ట్ర ఈ మ్యాచ్ లో 330 పరుగుల భారీ స్కోరు సాధించింది.
6⃣,6⃣,6⃣,6⃣,6⃣nb,6⃣,6⃣
Ruturaj Gaikwad smashes 4⃣3⃣ runs in one over! 🔥🔥
Follow the match ▶️ https://t.co/cIJsS7QVxK…#MAHvUP | #VijayHazareTrophy | #QF2 | @mastercardindia pic.twitter.com/j0CvsWZeES
— BCCI Domestic (@BCCIdomestic) November 28, 2022
Related News
Gaami OTT: ఓటీటీలో విశ్వక్ సేన్ గామి సరికొత్త రికార్డు.. 100 మిలియన్ తో స్ట్రీమింగ్
Gaami OTT: నూతన దర్శకుడు విద్యాధర్ కగిత దర్శకత్వం వహించిన విశ్వక్ సేన్ నటించిన చిత్రం గామి థియేట్రికల్ రన్లో మంచి స్పందనను అందుకుంది. ఈ చిత్రం ఇటీవలే OTTలోకి వచ్చింది. పెద్ద స్కీన్స్ లో ఎలా ఆకట్టుకుందో ఓటీటీలో ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్సకులను ఆకట్టుకుంటూ దుసుకెళ్తోంది. OTT ప్లాట్‌ఫారమ్ ZEE5 ఈ చిత్రం భారీ 100 మిలియన్ స్ట్రీమింగ్ తో దూసుకుపోతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్రెండ్ అవ�