HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Sports
  • >Saudi Arabia Is Planning To Enter The World Of Franchise Cricket By Injecting 500 Million Dollars Into A T20 League

Saudi Arabia T20 : గ్రాండ్ శ్లామ్ తరహాలో టీ20 లీగ్.. రూ.4,300 కోట్లతో సౌదీ రెడీ

సౌదీ అరేబియా(Saudi Arabia T20) టీ 20 లీగ్‌ను టెన్నిస్ గ్రాండ్ శ్లామ్ టోర్నమెంట్ తరహాలో నిర్వహించనున్నారట. 

  • By Pasha Published Date - 09:34 AM, Sun - 16 March 25
  • daily-hunt
Saudi Arabia T20 League Franchise Cricket Tennis Grand Slam

Saudi Arabia T20 : సౌదీ అరేబియా అనగానే మనకు పెట్రో డాలర్ గుర్తుకు వస్తుంది. లెక్కలేనంత ముడి చమురును ప్రపంచ దేశాలకు అమ్మేసి అంతులేని అమెరికా డాలర్లను ఈ దేశం కూడబెట్టింది. ఆ డబ్బుతో టీ20 లీగ్‌ వ్యాపారాన్ని శాసించేందుకు సౌదీ బరిలోకి దిగుతోంది. ఏకంగా రూ.4,300 కోట్లతో ప్రత్యేక టీ20 లీగ్‌ను నిర్వహించాలని సౌదీ సర్కారు యోచిస్తోంది. దీని నిర్వహణకు సంబంధించిన కొత్త వివరాలు బయటికి వచ్చాయి. అవేంటో చూద్దాం..

Also Read :Weekly Horoscope : వారఫలాలు.. మార్చి 16 నుంచి 22 వరకు రాశిఫలాలను తెలుసుకోండి

సౌదీ టీ20 లీగ్ గురించి.. 

  • సౌదీ అరేబియా(Saudi Arabia T20) టీ 20 లీగ్‌ను టెన్నిస్ గ్రాండ్ శ్లామ్ టోర్నమెంట్ తరహాలో నిర్వహించనున్నారట.
  • ఈ మెగా టోర్నమెంటులో 8 టీమ్‌లు మాత్రమే పాల్గొంటాయట.
  • ఏడాది వ్యవధిలో నాలుగు వేర్వేరు దేశాల్లో ఈ టోర్నమెంట్ జరుగుతుందట.
  • సౌదీ అరేబియా టీ 20 లీగ్‌ను ఆ దేశానికి చెందిన ఎస్‌ఆర్‌జే స్పోర్ట్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ నిర్వహించనుంది. దీనికి డ్యానీ టౌన్ సెండ్ సారథ్యం వహిస్తారు. ఈయన గతంలో ఏ-లీగ్‌కు సీఈఓగా సేవలు అందించారు. ఏ-లీగ్ అనేది ఆస్ట్రేలియాలో ప్రఖ్యాత సాకర్ టోర్నమెంట్.
  • లీగ్ టోర్నమెంట్ల నిర్వహణలో  డ్యానీ టౌన్ సెండ్‌కు అపార అనుభవం ఉంది. అందుకే ఆయనకు ఎస్‌ఆర్‌జే స్పోర్ట్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ సారథ్య బాధ్యతలు అప్పగించారు.
  • తాము ఏర్పాటు చేసే టీ20 లీగ్ గురించి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)తో ప్రస్తుతం ఎస్‌ఆర్‌జే స్పోర్ట్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ చర్చలు జరుపుతోందని సమాచారం. ఈ లీగ్‌లో చేరే దేశాల క్రికెట్ బోర్డులు, ప్రసార సంస్థలతో ఆదాయ పంపిణీ.. టోర్నీల నిర్వహణ షెడ్యూల్‌‌లో క్లాష్ రాకుండా చూడటంపై డిస్కషన్ నడుస్తోందట.
  • ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్‌లో మంచి పలుకుబడి కలిగిన ప్రముఖ క్రికెట్ ఆల్ రౌండర్ నీల్ మ్యాక్స్‌వెల్ సలహాలను  కూడా ఎస్‌ఆర్‌జే స్పోర్ట్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ తీసుకుంటోందని సమాచారం.

Also Read :Lex Fridman : ప్రధాని మోడీని ఇంటర్వ్యూ చేసిన లెక్స్ ఫ్రిడ్‌మన్.. ఎవరు ?

  • భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్  దేశాలే సౌదీ టీ20 లీగ్‌ నిర్వహణలో ప్రధాన వేదికలుగా ఉంటాయని తెలిసింది. ఎందుకంటే ఎక్కువ క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నది ఈ దేశాల్లోనే. క్రికెట్‌కు ఎక్కువ ఆదాయాన్ని పండిస్తున్నదీ ఈ దేశాలే.
  • భారత్‌లో జరిగే ఐపీఎల్,  ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్‌ల షెడ్యూల్‌తో క్లాష్ రాకుండా, సమన్వయంతో ముందుకు వెళ్లాలని సౌదీ భావిస్తోందట.
  • పురుషుల క్రికెట్‌తో పాటు మహిళా క్రికెట్‌ను కూడా  ప్రోత్సహించాలని సౌదీ అనుకుంటోందట.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Franchise Cricket
  • Grand Slam
  • Saudi Arabia
  • Saudi Arabia T20
  • T20 League
  • tennis
  • Tennis Grand Slam

Related News

    Latest News

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Viral : రూ.10 వేల కోట్ల ఆస్తి ఫుట్‌బాల్‌ స్టార్‌కి రాసిచ్చిన బిలియనీర్‌

    • Coolie : వచ్చేస్తోంది.. ‘కూలీ’ ఇప్పుడు ఏ ఓటీటీలో అంటే..?

    • Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd