HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Ronaldos Journey Comes To An End

FIFA 2026: ముగిసిన రొనాల్డో ప్రయాణం.!

  • Author : Vamsi Chowdary Korata Date : 07-07-2026 - 9:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ronaldo's journey comes to an end!
Ronaldo's journey comes to an end!

అమెరికా వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ 2026లో పోర్చుగల్ ప్రయాణం ముగిసింది. ఫుట్‌బాల్ దిగ్గజంగా పేరు పొందిన క్రిస్టియానో రొనాల్డో తన చివరి ప్రపంచ కప్ మ్యాచ్‌ను ఓటమితో ముగించాడు. స్పెయిన్‌తో జరిగిన ప్రీ క్వార్టర్ మ్యాచులో పోర్చుగల్ 1-0 తేడాతో ఓటమి పాలైంది. ఈ విజయంతో స్పెయిన్ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. పోర్చుగల్ మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక 2 దశాబ్దాలకు పైగా తన ఆటతో మంత్రముగ్ధులను చేసిన రొనాల్డో, తన చివరి మ్యాచ్ ముగిసిన తర్వాత భావోద్వేగానికి గురై కంటతడి పెట్టాడు.

పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో 2006లో తొలిసారి ఫిఫా వరల్డ్ కప్ ఆడాడు. ఫిఫా ప్రపంచకప్ 2026 తనకు చివరి టోర్నీ అని రొనాల్డో ఇదివరకే ప్రకటించాడు. కానీ తన జట్టును మరోసారి క్వార్టర్ ఫైనల్‌కు తీసుకెళ్లాలన్న అతడి ఆశలు నెరవేరలేదు. స్పెయిన్ తరఫున మికెల్ మెరినో చేసిన ఏకైక గోల్ స్పెయిన్ విజయాన్ని, పోర్చుగల్ నిష్క్రమణను ఖాయం చేసింది. కాగా స్పెయిన్ 2010లో ఫిఫా ప్రపంచకప్ టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత ఒక్కసారి కూడా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోలేదు. కానీ 16 ఏళ్ల తర్వాత మళ్లీ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. స్పెయిన్ క్వార్టర్ ఫైనల్‌లో బెల్జియంతో తలపడే అవకాశం ఉంది.

మరోవైపు ఈ మ్యాచ్‌తో స్పెయిన్ వరుసగా ఆరు ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో ప్రత్యర్థులకు గోల్ చేసే అవకాశమే ఇవ్వకుండా కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇటలీ (1990), స్విట్జర్లాండ్ (2006-10) పేరిట ఉన్న ఐదు వరుస క్లీన్ షీట్‌ల రికార్డును ఆ జట్టు అధిగమించింది. గోల్‌ కీపర్ ఉనై సిమోన్ వ్యక్తిగతంగానూ అరుదైన ఘనత సాధించాడు. వరుసగా 609 నిమిషాల పాటు గోల్ ఇవ్వకుండా నిలిచి ప్రపంచ కప్ చరిత్రలో కొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో ఇటలీ దిగ్గజ గోల్‌ కీపర్ వాల్టర్ జెంగా పేరిట ఉన్న 517 నిమిషాల రికార్డును అతడు బ్రేక్ చేశాడు.

ఇక 41 ఏళ్ల రొనాల్డో అరుదైన రికార్డు సాధించాడు. ఆరు ప్రపంచకప్‌లు ఆడిన ఇతడు అన్నింట్లోనూ గోల్ చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. తాజా టోర్నీలో అతడు మూడు గోల్స్ చేశాడు. ఆరు సార్లు ప్రపంచకప్ ఆడినా రొనాల్డో మాత్రం ట్రోఫీ అందుకోలేకపోయాడు. తన డెబ్యూ ప్రపంచకప్ అయిన 2006లో రొనాల్డో జట్టు సెమీస్ వరకూ చేరింది. ఇదే అతడి కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన. మొత్తంగా ప్రపంచకప్‌లో అతడు 27 మ్యాచులలో 11 గోల్స్ చేశాడు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Cristiano Ronaldo
  • FIFA 2026
  • FIFA World Cup 2026
  • portugal
  • portugal football team

Related News

    Latest News

    • Gold Rate: మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

    • TCS నాసిక్‌లో లైంగిక వేధింపులు మరియు మత మార్పిడి కేసులో నిందితురాలైన మహిళకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

    • Rain Alert: నేడు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు

    • jnaneswari: జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో బిగ్ ట్విస్ట్..

    • FIFA 2026: ముగిసిన రొనాల్డో ప్రయాణం.!

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

      • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd