Rohit Sharma: ఇండియన్ జెర్సీ ధరించిన రోహిత్ శర్మ కుమార్తె సమైరా
కెప్టెన్ రోహిత్ శర్మ కూతురు సమైరా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందుకు కారణం ఆమె ఇండియన్ జెర్సీని ధరించి మరీ పోజులివ్వడమే. అంతేకాకుండా, జెర్సీ వెనుక అతని తండ్రి పేరు మరియు నంబర్ ఉంది. రోహిత్ భార్య రితికా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో సమైరా ఫోటోను షేర్ చేసింది.
- By Praveen Aluthuru Published Date - 04:28 PM, Wed - 1 November 23

Rohit Sharma: కెప్టెన్ రోహిత్ శర్మ కూతురు సమైరా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందుకు కారణం ఆమె ఇండియన్ జెర్సీని ధరించి మరీ పోజులివ్వడమే. అంతేకాకుండా, జెర్సీ వెనుక అతని తండ్రి పేరు మరియు నంబర్ ఉంది. రోహిత్ భార్య రితికా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో సమైరా ఫోటోను షేర్ చేసింది. దీనికి సంబందించిన పోస్టుపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకోవాలని సమైరాను ఉద్దేశించి కామెంట్స్ పెడుతున్నారు.
ప్రపంచకప్ లో టీమిండియా అదరగొడుతుంది. కప్ కొట్టాలన్న కోట్లాది భారతీయుల కలను నిజం చేసేందుకు ఆటగాళ్లు మైదానంలో కష్టపడుతున్నారు.ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్ లో ఉండటం జట్టుకి బాగా కలిసొస్తుంది. ఓపెనర్ గా రోహిత్ అద్భుత ఆరంభాన్ని అందిస్తున్నాడు. ఎడాపెడా సిక్సర్లతో పరుగుల వరద పారిస్తున్నాడు. దానికి తోడు కింగ్ కోహ్లీ రెచ్చిపోతున్నాడు. ఓపెనర్ గిల్ అవుట్ అవ్వడమే ఆలస్యం కోహ్లీ జోరందుకుంటున్నాడు. ఆరంభంలో ఆచూతూచి ఆడుతూ.. మిడ్ ఓవర్లలో బలమైన షాట్లతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాడు. ఇక కేఎల్ రాహుల్ సైతం ఇన్నింగ్ మ్యాచ్ తో పరుగులు రాబడుతున్నాడు.
Also Read: 2023 World Cup Effect : వరల్డ్ కప్ దెబ్బ కు ‘ఆదికేశవ’ వెనక్కు