Rohit Sharma: రోహిత్ హార్ట్ బ్రేకింగ్ వీడియో
సెమీ-ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి వరుసగా 10 విజయాలతో ఫైనల్‌కు చేరిన రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు టైటిల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి కప్ చేజార్చుకుంది. కోట్లాది మంది భారతీయుల కల తీర్చలేకపోయామన్న బాధ జట్టు సభ్యుల్లో స్పష్టంగా కనిపించింది.
- Author : Praveen Aluthuru
Date : 13-12-2023 - 5:11 IST
Published By : Hashtagu Telugu Desk
Rohit Sharma: సెమీ-ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి వరుసగా 10 విజయాలతో ఫైనల్‌కు చేరిన రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు టైటిల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి కప్ చేజార్చుకుంది. కోట్లాది మంది భారతీయుల కల తీర్చలేకపోయామన్న బాధ జట్టు సభ్యుల్లో స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానం నుండి కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్లడం ప్రతిఒక్కరిని బాధించింది.
ఫైనల్ మ్యాచ్ ముగిసి సుమారు నెల రోజులు పూర్తయినప్పటికీ ప్రపంచ కప్ ఓటమి నుండి తాను బయటకు రాలేకపోయానని చెప్పాడు రోహిత్ శర్మ. ఈ సందర్భంగా రోహిత్ శర్మ హార్ట్ బ్రేకింగ్ వీడియో ఒకటి పోస్ట్ చేశాడు. ప్రపంచకప్ ఓటమి తర్వాత మళ్లీ స్టేడియంలోకి ఎలా అడుగుపెట్టాలో తెలియడం లేదని బాధపడ్డాడు రోహిత్. ప్రపంచకప్ మిగిల్చిన బాధనుంచి బయటపడేందుకు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎంతో సహాయపడ్డారని అన్నాడు. కానీ అభిమానులను చూస్తే చాలా బాదేస్తుందని రోహిత్ భావోద్వేగానికి గురయ్యాడు. ఆటలో గెలుపోటములు సహజం. ఫలితం ఏదైనా ముందుకు సాగాల్సిందేనని చెప్పారు హిట్ మ్యాన్. దాదాపు నెల తర్వాత దక్షిణాఫ్రికా గడ్డపై మూడు టెస్టుల సిరీస్ కోసం రోహిత్ జట్టులోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు.
A heart-breaking video of Captain Rohit Sharma about the loss in the World Cup final.
– Comeback strong, Ro. 🫡pic.twitter.com/wc8W896adH
— Johns. (@CricCrazyJohns) December 13, 2023
Also Read: Bats: కలలో గబ్బిలాలు కనిపిస్తే ఏమి జరుగుతుందో తెలుసా?