India @ Asia Cup: మిషన్ ఆసియా కప్…టీమిండియా ప్రాక్టీస్ షురూ
టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ముందు జరగనున్న మేజర్ టోర్నీ ఆసియా కప్ కు భారత్ సన్నద్ధమవుతోంది.
- Author : Naresh Kumar
Date : 25-08-2022 - 12:15 IST
Published By : Hashtagu Telugu Desk
టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ముందు జరగనున్న మేజర్ టోర్నీ ఆసియా కప్ కు భారత్ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఎడారి దేశం చేరుకున్న టీమిండియా క్రికెటర్లు ప్రాక్టీస్ మొదలు పెట్టారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో సహా దాదాపు జట్టంతా యూఏఈ చేరుకోగా….జింబాబ్వే టూర్ లో ఉన్న కే ఎల్ రాహుల్, అక్షర్ పటేల్, దీపక్ చహర్ హారారే నుంచి నేరుగా వచ్చి జట్టుతో కలిసారు. తొలి రోజు ప్రాక్టీస్ సెషన్ లో భారత ఆటగాళ్లు నెట్స్ లో బిజీ బిజీగా గడిపారు. అక్కడి వాతావరణం బాగా వేడిగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం నుంచే ప్రాక్టీస్ షురూ చేశారు.
కాగా ఆసియా కప్ కోసం భారత హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నాడు. టీమిండియాతో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కరోనా బారిన పడటంతో అతడు టీమ్‌తో కలిసి దుబాయ్ వెళ్లలేకపోయాడు. ద్రావిడ్ టోర్నీ ప్రారంభమయ్యే సమయానికి కోలుకునే అవకాశం లేకపోవడంతో లక్ష్మణ్‌కు ఆ బాధ్యతలు అప్పగించినట్లు బీసీసీఐ వెల్లడించింది. ఇక బ్యాటింగ్, బౌలింగ్ కోచ్‌లు విక్రమ్ రాథోడ్, పరాస్ మాంబ్రేలు టీమ్‌తోనే ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 11 వరకూ ఆసియాకప్ జరగనుంది.
ఆగస్టు 27న శ్రీలంక, ఆఫ్గనిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్‌తో 15వ ఆసియాకప్‌కు తెరలేనుంది.కాగా భారత్ జట్టు తన తొలి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడనుంది. ఆదివారం దుబాయ్ వేదికగా ఈ మెగా క్లాష్ జరగబోతోంది. ఇప్పటికే భారత్ , పాకిస్థాన్ జట్లతో పాటు టోర్నీలో ఆడే మిగిలిన టీమ్స్ కూడా అక్కడికి చేరుకున్నాయి. మరోవైపు ఆసియా కప్‌లో కోహ్లీ పైనే అందరి దృష్టి ఉంది. చాలా కాలంగా ఫామ్ కోసం తంటాలు పడుతున్న కోహ్లీ ఈ టోర్నీలోనైనా కోహ్లీ ఫామ్ అందుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు.
ఆసియా కప్ లో ఆడే భారత్ జట్టు :
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్ ), రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్, రవి బిష్ణోరు భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్.
స్టాండ్‌బై : శ్రేయాస్ అయ్యర్, దీపక్ చాహర్, అక్షర్ పటేల్
Hello DUBAI 🇦🇪
Hugs, smiles and warm-ups as we begin prep for #AsiaCup2022 #AsiaCup | #TeamIndia 🇮🇳 pic.twitter.com/bVo2TWa1sz
— BCCI (@BCCI) August 24, 2022