Iyer- Gill Century: సెంచరీలతో అదరగొట్టిన అయ్యర్, గిల్..!
ఆస్ట్రేలియాతో ఇండోర్ వన్డేలో శ్రేయాస్ అయ్యర్, గిల్ అద్భుత సెంచరీ (Iyer- Gill Century)లు సాధించారు.
- By Gopichand Published Date - 04:39 PM, Sun - 24 September 23

Iyer- Gill Century: ఆస్ట్రేలియాతో ఇండోర్ వన్డేలో శ్రేయాస్ అయ్యర్, గిల్ అద్భుత సెంచరీ (Iyer- Gill Century)లు సాధించారు. అయ్యర్ 86 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. శ్రేయాస్ అయ్యర్ వన్డే కెరీర్‌లో ఇది మూడో సెంచరీ. ఓపెనర్ గిల్ 92 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. శ్రేయాస్ అయ్యర్ 90 బంతుల్లో 105 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తన ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. అంతకుముందు మొహాలీ వన్డేలో శ్రేయాస్ అయ్యర్ తొందరగానే ఔటయ్యాడు. అయితే ఈ మ్యాచ్‌లో అద్భుతంగా పునరాగమనం చేశాడు. తొలి వన్డేలో హాఫ్ సెంచరీ చేసిన గిల్ ఈ మ్యాచ్ ;లో సెంచరీతో తన పరుగుల దాహాన్ని తీర్చుకున్నాడు.
అంతకుముందు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు 16 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 12 బంతుల్లో 8 పరుగులు చేసి నిష్క్రమించాడు. అయితే దీని తర్వాత శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ మధ్య గొప్ప భాగస్వామ్యం ఏర్పడింది. భారత బ్యాట్స్‌మెన్‌లిద్దరూ ఆస్ట్రేలియా బౌలర్లపై సులువుగా పరుగులు సాధించారు.
Also Read: Telugu Players – Asian Games : ఆసియా గేమ్స్ లో తెలంగాణ, ఏపీ ప్లేయర్స్ వీరే..
శ్రేయాస్ అయ్యర్ 90 బంతుల్లో 105 పరుగులు చేసి సీన్ అబాట్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అయ్యర్ తన ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు. కాగా.. ఈ వార్త రాసే సమయానికి శుభ్‌మన్ గిల్ 97 బంతుల్లో 104 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. శుభ్‌మన్ గిల్ తన ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టాడు. అయ్యర్, గిల్ ఇద్దరు ఆటగాళ్ల మధ్య 200 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. ప్రస్తుతం భారత్ స్కోర్ 35 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది.