Ronaldo Rape Case: రొనాల్డో పై అత్యాచార కేసు కొట్టివేత
వరల్డ్ ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకు భారీ ఊరట లభించింది.
- Author : Naresh Kumar
Date : 12-06-2022 - 12:05 IST
Published By : Hashtagu Telugu Desk
వరల్డ్ ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకు భారీ ఊరట లభించింది. రొనాల్డోపై అత్యాచార కేసును కొట్టివేస్తున్నట్లు అమెరికా కోర్టు ప్రకటించింది. బాధితరాలి తరపు లాయర్ సరైన ఆధారాలను కోర్టుకు సమర్పించలేకపోయాడని 42 పేజీల తీర్పులో పేర్కొంది. ఫుట్‌బాల్ కెరీర్‌లో ఎలాంటి మచ్చ లేకుండా సాగుతున్న రొనాల్డోకు వ్యక్తిగత జీవితంలో మాత్రం ఈ అత్యాచారం కేసు చాలా ఇబ్బంది పెడుతూ వచ్చింది.
2009లో లాస్ వెగాస్ లోని ఒక హోటల్ లో తనపై రోనాల్డో అత్యాచారం చేసినట్లు కేత్రిన్ మోయెర్గా అనే మహిళ కోర్టులో కేసు వేసింది. దీనిపై గత కొన్నేళ్లుగా సుదీర్ఘ విచారణ జరిపిన లాస్ వెగాస్ కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. బాధితరాలు తరపున వాదనలు వినిపించిన లాయర్ సరైన ఆధారాలను కోర్టుకు సమర్పించలేకపోయాడని 42 పేజీల తీర్పులో పేర్కొంది. అదే క్రమంలో రొనాల్డో అత్యాచార కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా క్రిస్టియానో రొనాల్డోకు భారీ ఊరట లభించింది. కోర్టు తీర్పుతో అతని ఫాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేవలం డబ్బుల కోసమే సదరు మహిళా ఇలా చేసి ఉంటుందని అంటున్నారు.
ఇదిలా ఉంటే రొనాల్డో నాయకత్వంలోనే పోర్చుగల్ జట్టు ఈ ఏడాది ఖతర్ వేదికగా జరిగనున్న ఫుట్ బాల్ ప్రపంచకప్ కు అర్హత సాధించింది. వయసు రిత్యా చూస్తే రొనాల్డోకు ఇదే ఆఖరి వరల్డ్‌కప్ కావొచ్చని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం నేషన్స్ లీగ్లో పోర్చుగల్ జట్టుకు రొనాల్డో కెప్టెన్‌గాగా వ్యవహరిస్తున్నాడు.దీంతో 2022 ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్‌ను ఎలాగైనా విజేతగా నిలపాలని కెరీర్ కు గుడ్ బై చెప్పాలని రొనాల్డో భావిస్తున్నాడు.