IPL 2024 : హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం..ఉప్పల్ లో మ్యాచ్ జరిగేనా..?
ప్రస్తుతం ఉన్న సమీకరణాల దృష్ట్యా సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టాలంటే..ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలువాల్సి ఉంది. గుజరాత్‌పై ఓడినా హైదరాబాద్‌కు ప్లేఆఫ్స్‌కు చేరేందుకు మరో అవకాశం ఉంటుంది. కానీ వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి.. టాప్-2లో చోటు దక్కించుకోవాలని కమిన్స్ సేన చూస్తోంది
- By Sudheer Published Date - 04:38 PM, Thu - 16 May 24

మరికాసేపట్లో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం (Hyderabad Uppal Stadium) లో సన్‌రైజర్స్ హైదరాబాద్ Vs గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ (Sunrisers Hyderabad Vs Gujarat Titans Match
) జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగా..ముఖ్యంగా ఉప్పల్ (Uppal Stadium) పరిసర ప్రాంతాలలో గంట నుండి భారీ వర్షం (Rain) కురుస్తుండడంతో ఈరోజు మ్యాచ్ జరుగుతుందా..లేదా అని అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. ప్రస్తుతం 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించిన సన్‌రైజర్స్.. 14 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
ప్రస్తుతం ఉన్న సమీకరణాల దృష్ట్యా సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టాలంటే..ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలువాల్సి ఉంది. గుజరాత్‌పై ఓడినా హైదరాబాద్‌కు ప్లేఆఫ్స్‌కు చేరేందుకు మరో అవకాశం ఉంటుంది. కానీ వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి.. టాప్-2లో చోటు దక్కించుకోవాలని కమిన్స్ సేన చూస్తోంది. మెరుపు బ్యాటింగ్‌తో అదరగొడుతున్న సన్‌రైజర్స్‌ను సొంతగడ్డపై అడ్డుకోవడం గుజరాత్‌కు సవాలే. మే 8న ఉప్పల్‌లో లక్నోపై 166 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 9.4 ఓవర్లలోనే సన్‌రైజర్స్ సాధించిన సంగతి తెలిసిందే. వారం విరామం తర్వాత మరింత ఉత్సాహంతో ఆడనున్న సన్‌రైజర్స్.. గుజరాత్‌పైనా చెలరేగేందుకు సిద్ధమైంది. మరోవైపు ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన గుజరాత్.. విజయంతో లీగ్‌ను ముగించాలని చూస్తోంది.
కానీ ప్రస్తుతం హైదరాబాద్ లో భారీ వర్షం పడుతుండడంతో మ్యాచ్ జరుగుతుందో లేదో అర్ధం కానీ పరిస్థితి. రాత్రి టాస్ వేసే సమాయానికి వర్షము తగ్గితే మ్యాచ్ జరుగుతుంది..లేదంటే మ్యాచ్ ను రద్దు చేసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం మాత్రం మరో రెండు గంటల పాటు హైద్రాబాద్లో భారీ వర్షం పడనుందని వాతావరణ శాఖ తెలుపుతుంది.
Read Also : Allu Arjun : మరోసారి పవన్ ఫ్యాన్స్..బన్నీ కి షాక్ ఇవ్వబోతున్నారా..?